Chiranjeeviని కలిసి ఎమోషనల్ అయిన శ్రీకాంత్ అయ్యంగార్.. ఏడ్చేస్తూ?

గత కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీ మొత్తానికి పెద్దగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు మొదలు వ్యాక్సిన్ వేయించే వరకు ఆయన కరోనా చారిటీ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఆయన అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. తాజాగా చిరంజీవిని కలిసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా

ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి అసామాన్యుడిగా ఎదిగిన చిరు, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నగా మారారు. వివాదాలు, విషాదాలు, సమస్యలు, సంబరాలు ఏవి వచ్చినా అన్నింటిలో తాను ముందుండి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు.

నేనున్నా

నేనున్నా

ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. బయట అభిమానుల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా కాదనకుండా వస్తున్నాడు.. తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా కొద్ది మంది ఇండస్ట్రీ వారు మరణించగా వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసిన చిరు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తన అభిమానుల మరణం సమయంలో కూడా అలాగే స్పందించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసి మరీ సహాయం అందిస్తున్నారు.

ఎమోషనల్ అయి ఏడ్చేసిన శ్రీకాంత్

ఎమోషనల్ అయి ఏడ్చేసిన శ్రీకాంత్

అంత సేవ చేస్తున్న ఆయనకు ఎవరైనా ఇట్టే అభిమానులుగా మారిపోతూ ఉంటారు. తాజాగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవిని కలిశారు. ఈ క్రమంలో చిరంజీవి తనను రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఎమోషనల్ అయి ఏడ్చేయడం కనిపించింది. మొత్తం మీద ఈ సంగతి హాట్ టాపిక్ గా మారింది.

శ్రీకాంత్ అయ్యంగార్ సినిమాల విషయానికి వస్తే

శ్రీకాంత్ అయ్యంగార్ సినిమాల విషయానికి వస్తే

ఎక్కువగా వర్మ సినిమాల్లో కనిపించే శ్రీకాంత్ అయ్యంగార్ ఈ మధ్య మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బయట సినిమాలు కూడా బాగా చేస్తున్నారు. థన్ గురువు ఆర్జీవీ లాగే మాట్లాడుతూ ఉండే ఆయన చిరంజీవిని కలిసి కన్నీళ్లు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి .

Recommended Video

Hero Roshan Smart And Funny Answers | Pelli Sandadi
చిరు సినిమాల విషయానికి వస్తే

చిరు సినిమాల విషయానికి వస్తే

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల విషయానికొస్తే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నట్టు కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ముందుగా లూసిఫర్ రీమేక్ సినిమా అయినా గాడ్ ఫాదర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X