డ్రగ్స్ కేసులో లోపలేసినా పోయేది లేదు, అందుకే పెళ్లి చేసుకోలేదు.. నటుడు సుబ్బరాజు షాకింగ్ గా!

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లకే కాకుండా కొంతమంది నటీనటులకు కూడా మంచి పాపులారిటీ ఉంటుంది. ఒక రకమైన పాత్రల్లో వాళ్లు తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేం. రెగ్యూలర్ గా ఒకే తరహా పాత్రలు చేసినప్పటికీ బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేస్తుంటారు. అలాంటి నటుల్లో సీనియర్ యాక్టర్ సుబ్బరాజు ఒకరు.

చేసేది ఎలాంటి క్యారెక్టర్ అయినా తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ గా అయినా, సపోర్టింగ్ పాత్రలు అయినా.. కామెడీ తరహా రోల్స్ అయినా తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో పర్ఫామ్ చేసి ఆకట్టుకుంటారు. అయితే సినిమాల్లో తప్పా బయట ఎక్కువగా కనిపించని సుబ్బరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అనుకోకుండా సినిమాల్లోకి..

అనుకోకుండా సినిమాల్లోకి..

పెన్మెత్స సుబ్బరాజు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో ఫిబ్రవరి 27, 1977న జన్మించారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన వాళ్లలో సుబ్బరాజు ఒకరు. సుబ్బరాజు డెల్ కంప్యూటర్ సర్వీసింగ్ సెంటర్ లో పనిచేసేవారు. ఒకరోజు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ పర్సనల్ కంప్యూటర్ పనిచేయకపోవడంతో.. రిపేర్ చేయడానికని వెళ్లారు సుబ్బరాజు. అక్కడ సుబ్బరాజుని చూసిన కృష్ణవంశీ ఆయనకు ఖడ్గం సినిమాలో ఒక చిన్న రోల్ చేసే అవకాశం ఇచ్చారు.

దేశ ముదురు సినిమాతో..

దేశ ముదురు సినిమాతో..

అలా 2003లో ఖడ్గం సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన సుబ్బరాజు దాదాపుగా 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షులను అలరిస్తున్నారు. ఖడ్గం తర్వాత అమ్మ నాన్న తమిళ అమ్మాయి చిత్రంలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన సుబ్బరాజుకు అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో మాత్రం మంచి పాపులారిటీ లభించింది. యాక్టింగ్ లో తనదైన ఇంటెన్స్ చూపించే సుబ్బరాజుకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలో కచ్చితంగా ఓ పాత్ర ఉంటుంది.

ఆసక్తికర విషయాలు..

ఆసక్తికర విషయాలు..

అయితే 2017లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది డ్రగ్స్ కేసు. ఈ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మీ, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజుతోపాటు ఎంతో మంది నటీనటులను దర్యాప్తు సంస్థ సిట్ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో డిప్రెషన్ కు గురైన సుబ్బరాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పెళ్లి చేసుకోకుండా తండ్రి ఏంటీ..

పెళ్లి చేసుకోకుండా తండ్రి ఏంటీ..

20 ఏళ్ల సినీ ప్రయాణం ఎలా ఉంది. కంఫర్టబుల్ గా ఉందా అని యాంకర్ అడగ్గా.. ఇండస్ట్రీలో ఉండాలంటే ఫిట్ గా ఉండాలి. ఆ తర్వాత ఏది వస్తే అది చేసుకుంటూ పోవాలి. మంచి పాత్రలు రావాలంటే ఫిట్ గా ఉండాలి. లేదు అనుకుంటే.. వదిలేసి.. ఫాదర్ క్యారెక్టర్లు చేయాలి అని సుబ్బరాజు తెలిపారు. దీంతో పెళ్లి చేసుకోకుండా ఫాదర్ ఎలా అవుతారు అని అడగ్గా.. భీమవరంలోని డీఎన్ఆర్ కాలేజీలో మా తండ్రి లెక్చరర్ గా ఉండటంతో కొంచెం డిసిప్లిన్ గా పెరిగినట్లు సుబ్బరాజు చెప్పుకొచ్చారు.

రామ్ గోపాల్ వర్మలా ఏం లేదు..

రామ్ గోపాల్ వర్మలా ఏం లేదు..

చిన్నప్పటి నుంచి నన్ను అడిగేవారు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని.. ఫ్రెండ్సే లేరు ఇంకా గర్ల్ ఫ్రెండ్సా అని సుబ్బరాజు అంటే.. పెళ్లి ఎందుకు చేసుకోవద్దనుకున్నారు అని యాంకర్ అడిగారు. అందుకు కేవలం కోరికలతో చేసుకోకూడదు.. ఆ అవసరం రావాలి అని సుబ్బరాజు అన్నారు. పోనీ రామ్ గోపాల్ వర్మ లాంటి రిలేషన్స్ ఉన్నాయా అని అడిగితే.. ఆయనకు ఎలాంటి రిలేషన్స్, ఏం ఉన్నాయో నాకు తెలియదు కానీ నా జీవితంలో అలాంటివి ఉండవు లేండి అని సుబ్బరాజు తెలిపారు.

అడక్కూడదనేది నా స్వభావం..

అడక్కూడదనేది నా స్వభావం..

హీరోగా చేయమని అడగలేదా అన్నదానికి.. వేరొకరి డబ్బుతో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడతాను. ఇది కాకపోతే ఇంకో పని చేద్దామనే మైండ్ సెట్ తోనే నటుడిగా కంటిన్యూ అవుతున్న అని సుబ్బరాజు తెలిపారు. త్రివిక్రమ్, పూరి లాంటి స్టార్ డైరెక్టర్లను మంచి క్యారెక్టర్లు అడగలేదా అని అంటే.. అడక్కూడదనేది నా స్వభావం అని చెప్పాడు సుబ్బరాజు. దీనికి రాజులు కదా అని యాంకర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక భీమవరం రాజులు అంటే.. రొయ్యలు, పీతలు బాగా తింటారు. కోడి పందేలు, పేకాట ఆడతారు అనే పేరు ఉందని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.

 దీనికేమైనా చేయగలమా..

దీనికేమైనా చేయగలమా..

డ్రగ్స్ కేసులో డిస్టర్బెన్స్ గురించి అడగ్గా.. ఆ విషయంలో తనకు జరిగే డ్యామేజ్ కంటే.. పేరెంట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారనే బాధపడ్డానని, వాళ్లకు ఎలా ధైర్యం చెప్పాలని సతమతమైనట్లు సుబ్బరాజు తెలిపాడు. ఎందుకంటే.. బయటకు వెళ్లి చెప్పకపోయినా.. తలుపు కొట్టి మరి మీ అబ్బాయి ఇలా అంటా కదా అని అడిగే సొసైటీ కదా మనది అని సుబ్బరాజు అన్నాడు.

ఇంతకీ ఏ గ్రౌండ్ మీద మిమ్మల్ని పిలిచారని మీరు అడగలేదా అంటే.. ఒకవేళ ఏదో ఒక కారణం చెప్పి లోపల పడేసినా నాకు పోయేదేం ఉండదని సుబ్బరాజు ఆన్సర్ ఇచ్చాడు. అదేంటని యాంకర్ అడిగితే.. ఏం చేస్తాం మరి.. దీనికేమైన చేయగలుగుతామా అని సుబ్బరాజు నవ్వుకుంటూ ఆన్సర్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X