Prasanna Vadanam: ప్రసన్న వదనం మూవీలో సుహాస్ లిప్ లాక్.... ఆయన భార్య రియాక్షన్ ఏంటంటే?
యంగ్ హీరో సుహాస్ విభిన్నమైన కాన్సెప్ట్ లు ఉన్న సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన ప్రసన్న వదనం వీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ గురించి తన భార్య ఎలా స్పందించింది అనే విషయాన్ని వివరించారు. మరి ఆ లిప్ లాక్ గురించి సుహాస్ భార్య రియాక్షన్ ఏంటన్న విషయంపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
టాలీవుడ్ హీరో సుహాస్ రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో హిట్ అనుకున్నాడు. అతికొద్ది గ్యాప్ తోనే మరో మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాడు. ప్రసన్న వదనం అనే మూవీతో మే 3న థియేటర్లోకి రాబోతున్నాడు.

ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. జేఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించగా, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ ప్రసన్న వదనం మూవీలో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ మూవీ మరికొన్ని గంటలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం దూకుడుగా ప్రమోషన్లలో పాల్గొంటుంది.
అందులో భాగంగానే తాజాగా సుహాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ గురించి ప్రస్తావన వచ్చింది. ప్రసన్న వదనం మూవీలో హీరోయిన్ తో లిప్ లాక్ సన్నివేశాన్ని చూశాక మీ భార్య ఎలా రియాక్ట్ అయ్యింది అనే ప్రశ్న ఎదురైంది సుహాస్ కి.ఆ ప్రశ్నకు సుహాస్ స్పందిస్తూ ఇదంతా సినిమాలో భాగమే అన్న విషయం ఆమెకి బాగా తెలుసు. కాబట్టి అదేంటి ఇదేంటి అని గుచ్చి గుచ్చి అడగదు అని క్లారిటీ ఇచ్చారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను ప్రారంభించిన సుహాస్ ప్రస్తుతం సంపాదించుకున్నాడు. అయితే సుహాస్ పర్సనల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.
సుహాస్ లలిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల పాటు వీరిద్దరి ప్రేమ సాగగా పెళ్ళికి కుటుంబ సభ్యులు నో చెప్పారు. దీంతో స్నేహితుల సాయంతో దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతే సుహాస్ తనకు బాగా కలిసి వచ్చింది అని చెప్తూ ఉంటాడు.
ఇక ప్రసన్న వదనం మూవీ యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోకు అవతలి వ్యక్తుల ముఖాలు కనిపించకపోవడం అనే జబ్బు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక క్రైమ్ జరగ్గా అందులో హీరో ఎలా ఇరుక్కుంటాడు? దాని నుంచి ఎలా బయటపడతాడు? అన్న ఇంటస్టింగ్ స్టోరీని థియేటర్లలో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











