64 దేశాల్లోని 18 కోట్ల బంజారాల కోసం సేవాదాస్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
శ్రీ శ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ దర్శకుడు కేపీఎన్ చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం "సేవాదాస్". సీనియర్ నటులు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో కేపీఎస్ చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా, రేఖా నిరోష హీరో హీరోయిన్లుగా నటించారు. బంజారా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి కేపీఎస్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్ర పోషించిన భానుచందర్, హీరో-డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్, నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా- సీతారామ్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు ఎమ్.చౌహాన్, సెకండ్ హీరో-హీరోయిన్స్ వినోద్ రైనా, రేఖా నిరోష మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే సేవాదాస్ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా "సేవాదాస్" చిత్రాన్ని తీర్చిదిద్దారు అని ఈ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను సుమన్, భానుచందర్ అభినందించారు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సేవాదాస్ సంచలన విజయం సాధించడం ఖాయం అని హీరో, డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ పేర్కొన్నారు.
నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్, బాలు చౌహాన్ మాట్లాడుతూ... సేవాదాస్ చిత్రం రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఏప్రిల్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల వినోద్ రైనా, రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు.
నటీనటులు: ఎస్ఆర్ఎస్ ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ తదితరులు
అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్, చిరుత రవితేజ, సంజయ్ భూషణ్, సాయి కుమార్
కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు, నవీన్,
వీఎఫ్‌ఎక్స్: కిషోర్ కాలకూరి
ఆర్ట్ డైరెక్టర్: విజయ్ ఏ
ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు, శ్రీ రాములు
కెమెరామెన్: విజయ్ టాగోర్
ఎడిటర్: ప్రదీప్
పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్ బాలు చౌహాన్
నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్
కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్


Click it and Unblock the Notifications











