బీజేపీలోకి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్... ఐదేళ్లు ఆయనే ప్రధాని అంటూ..
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ కాషాయ తీర్థం పుచ్చుకొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అనంతరం ఆయన బీజేపీలో చేరారు. పంజాబ్‌లోని గురుదాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సన్నిడీయోల్ బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అటల్ బీహారి వాజ్ పేయ్ నేతృత్వంలో నా తండ్రి ధర్మేంద్ర చేరారు. ఇప్పుడు మోడీ నాయకత్వంలో నేను చేరుతున్నాను. మరో ఐదేళ్లు ప్రధానిగా మోదీ ఉండాలని కోరుకొంటున్నాను అని అన్నారు.

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 1997లో వచ్చిన బోర్డర్ చిత్రం ద్వారా తన నటనతో అందరిలో దేశభక్తిని నింపారు. ఆయనకు ఉన్న జాతీయభావం అతడి సినిమాలు చెబుతాయి అని అన్నారు.
సన్నీ డియోల్ తాజా చిత్రం మొహల్లా అస్సి అనే చిత్రం ప్రధాని మోదీ నేతృత్వం వహించే వారణాసిలో చిత్రీకరించారు. అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం కార్యకర్తగా మారిన పాత్రలో సన్నీ కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











