Krishna No More: 14 సినిమాలు ఫ్లాప్ అయితే హీరోగా పనికి రాడు అన్నారు.. ఓకే ఏడాది 18 సినిమాలు

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు అనే వార్త తెలుసుకున్న అభిమానులు షాక్ అయ్యారు. ఇక మహేష్ బాబు కుటుంబం మరోసారి విషాదంలోకి వెళ్ళింది. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించిన ఎన్నో విశేషాలు గురించి ఇప్పుడు హట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఫ్లాప్స్ పై కృష్ణగారు అప్పట్లో చేసిన కామెంట్స్ లోకి వెళితే..

 ఎక్కువ సమయం షూటింగ్స్ లోనే..

ఎక్కువ సమయం షూటింగ్స్ లోనే..

కృష్ణగారు సృష్టించినా రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన హీరోల్లో కృష్ణ మొదటి స్థానంలో ఉంటారు. అప్పట్లో షూటింగ్స్ లో అందరు కూడా 10 లేదా 12 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొనేవారు. కానీ కృష్ణ గారు ఒకే రోజు మూడు నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ 16 గంటలకు పైగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని రోజులు అయితే కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోయినా సందర్భాలు కూడా ఉన్నాయి.

దాదాపు 300 పైగా సినిమాల్లో

దాదాపు 300 పైగా సినిమాల్లో


ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపు 300 పైగా సినిమాల్లో నటించారు. ఆయన మొదటి చిత్రం తేనె మనసులు నుంచి చివరి చిత్రం వరకు కూడా ఎప్పుడు సమయపాలన అనేది పాటించకుండా ఉండలేదు. ఆయన నిర్మతల మనిషి అంటూ ఉంటారు. ఒక దగ్గర డబ్బులు తక్కువ అయినా కూడా ఆయన పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. నిర్మాతలకు ఎంతో అండగా నిలిచేవారు.

హీరోగా పనికిరాడు

హీరోగా పనికిరాడు


ఇక ముఖ్యంగా 1968-69 సంవత్సరాలలో కృష్ణ గారు స్టార్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయారు. 70 కాలంలో కూడా ఆయన ఒకే ఏడాది 18 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక 1974 తర్వాత సూపర్ స్టార్ కృష్ణకు వరస అపజయాలు ఎదురయ్యాయి. అయితే ఆయన హీరోగా పనికిరాడు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా కృష్ణ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

ఒకేసారి 14 సినిమాలు ఫ్లాప్

ఒకేసారి 14 సినిమాలు ఫ్లాప్


అయితే ఒకేసారి 14 సినిమాలు ఫ్లాప్ అంటే అప్పట్లో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. ఇక కృష్ణ గారు వెనక్కి తగ్గకుండా పద్మాలయ స్టూడియోస్ లో మొదట పాడిపంటలు అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణ ఫామ్ లోకి వచ్చారు. ఇక ఎప్పటిలానే నిర్మాతలు ఆయన వెంటపడుతూ అడ్వాన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు.

ఫ్లాప్స్ పై కృష్ణ కామెంట్

ఫ్లాప్స్ పై కృష్ణ కామెంట్

సాధారణంగా ఈ రోజుల్లో ఒకే ఒక్క సినిమా ప్లాప్ అయినా కూడా నటీనటులు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు అని అది అలా ఎప్పుడూ అనుకోకూడదు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మనం అనుకున్న లక్ష్యం కోసం వచ్చినపుడు అందులోనే విజయం సాధించాలి అని.. మన పోరాటం ఉన్నంతవరకు అందరూ మనల్ని గుర్తు పెట్టుకుంటారు అని కూడా ఆయన చెప్పిన మాటలు ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X