Taraka Ratna No more.. హుటాహటిన హాస్పిటల్‌కు బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ!
నందమూరి తారకరత్న ఇకలేరు. జనవరి 27వ తేదీన కుప్పం ప్రాంతానికి సమీపంలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన గుండెపోటుకు గురైన చికిత్స పొందుతూ బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో మరణించారు. గుండెపోటుకు గురైన ఆయనకు ప్రాథమికంగా స్థానిక హాస్పిటల్‌లో చికిత్సను అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన హెల్త్ బులెటిన్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గత 23 రోజులుగా తారకరత్నకు నారాయణ హృదయాలయలో చికిత్సను అందిస్తున్నారు. కోమాలోకి వెళ్లిన ఆయనను బయటకు రప్పించడానికి మెదడుకు సంబంధించిన చికిత్సను అందించారు. ఓ దశలో విదేశాలకు తీసుకెళ్లి చికిత్స అందించాలని భావించారు. అయితే విదేశాల నుంచి నిపుణులైన వైద్యులను రప్పించి చికిత్సను అందించారు.

అయితే మహాశివరాత్రి రోజున తారకరత్న ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణతోపాటు నందమూరి కుటుంబ సభ్యులు హుటాహుటిన నారాయణ హృదయాలకు చేరుకొన్నారు.


Click it and Unblock the Notifications











