Masooda శివపుత్రుడు, ఖడ్గం తర్వాత.. సంగీతకు ఆ రేంజ్ మూవీ మసూద..
మళ్ళీ రావా లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తన మూడవ చిత్రంగా నిర్మించిన హారర్ డ్రామా చిత్రం మసూద. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్,. సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ..
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం చాలా బాధాకరం. మహేష్ బాబు గారికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మళ్లీరావా, ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కచ్చితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు.' అని అన్నారు.

తిరువీర్ మాట్లాడుతూ.. 'నాకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్‌గా అందరినీ భయపెట్టే ఇమేజ్ ఉంది. స్వధర్మ్ వాళ్లు నన్ను ఈ పాత్రకు అప్రోచ్ అయినప్పుడు షాక్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని అనుకున్నాను. కథ, పాత్ర గురించి కూడా అడగొద్దని అనుకున్నాను. కానీ నాకు పూర్తి స్క్రిప్ట్ ఇచ్చి చదువుకోమని అన్నారు. కథ నాకు ఎంతో బాగా నచ్చింది. నాకు డ్రామాలంటే చాలా ఇష్టం. స్వధర్మ్ వాళ్లు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత మంచి పాత్రను నాకు ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది.రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఎక్కువ మాట్లాడతాను' అని అన్నారు.

కావ్య కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. 'మా సినిమా గురించి మేం గొప్పగానే చెబుతుంటాం. కానీ ఇక్కడకు వచ్చిన దర్శకులంతా కూడా మా సినిమాను ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి క్రియేటివ్ పీపుల్స్ చెప్పాక మేం చెప్పడానికి ఇంకేం ఉంటుంది. థియేటర్లో ఈ దర్శకులంతా సినిమాను చూస్తున్నప్పుడు వీళ్ల రియాక్షన్స్ మేం చూశాం. ఈ రోజు ఇక్కడ చెప్పిందంతా జెన్యూన్ అని మాకు తెలుసు. రేపు ఆడియెన్స్ సినిమాను చూశాక వాళ్లకి కూడా తెలుస్తుంది. ప్రతీ సినిమాకు అందరూ కష్టపడి చేస్తుంటాం. కరోనాలో ఎన్నో కష్టాలు వచ్చినా సినిమాను పూర్తి చేశాం. రేపు ఈ సినిమాను ఆడియెన్స్ అంతా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను' అని అన్నారు.
భాందవి శ్రీధర్ మాట్లాడుతూ.. 'ఇది నాకు మొదటి చిత్రం. ఇంత మంచి టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. మేం తీసిన సినిమా అని చూడమని చెప్పడం లేదు. ఎవరైనా హెల్ప్ అడిగితే.. అనవసరం అయిన దాంట్లో ఎందుకు హెల్ప్ చేయడం అని అంతా అనుకుంటారు. కానీ ఇందులో ఓ మంచి సందేశం ఉంది. మనిషికి మూడు సందర్భాల్లో ఏడుపు వస్తుంది. ఈ మూడు సందర్భాల్లో వచ్చే సీన్స్ బాగుంటాయి. మా దర్శకుడు ఎంతో సహజంగా తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. స్వధర్మ్ అంటే ఏజెంట్, మళ్లీరావా సినిమాలు గుర్తొస్తాయి. హారర్ సినిమాలకు విజువల్స్, మ్యూజిక్ ఇంపార్టెంట్. అవి రెండూ చక్కగా కుదిరాయి. తిరువీర్ ఎంతో సైలెంట్‌గా ఉంటారు. సంగీత గారు నా తల్లి పాత్రను పోషించారు. కావ్యా నాకు మంచి ఫ్రెండ్. మసూద సినిమా రేపు రిలీజ్ అవుతోంది. అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను' అని అన్నారు.
ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ.. 'భయపెట్టడం చాలా కష్టమని నాకు తెలిసింది. ఇంత వరకు నేను హారర్ మూవీలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయలేదు. రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా కోసం అందరూ కష్టపడ్డారు. ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. రేపు ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ సినిమాను చూడండి' అని అన్నారు.
ఆర్డ్ డైరెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. 'స్వధర్మ్ బ్యానర్‌లో పని చేయడం నాకు సంతోషంగా ఉంది. వరుసగా మూడు చిత్రాలు చేశాను. శివపుత్రుడు, ఖడ్గం, మసూద అనేది సంగీత మేడం కెరీర్‌లో నిలిచిపోతాయి. ఈ చిత్రంలో చిన్న పాత్రను కూడా పోషించాను' అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ నగేష్ బనెల్ మాట్లాడుతూ... ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్ గారికి, దర్శకుడు సాయి గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ కథని తెరకెక్కించడానికి కావాల్సిన అన్నింటినీ స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ అందించింది. దర్శకుడు సాయి కిరణ్ మైండ్ లో వున్న షాట్స్ ని అలాగే తెరకెక్కించారు. సినిమాలో విజువల్స్ గ్రాండ్ గా వుంటాయని, ఈ సినిమాని థియేటర్ లోనే చూడాలని కోరారు.
నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
కళ: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బానెల్
స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
పీఆర్వో: బి.వీరబాబు
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్


Click it and Unblock the Notifications











