తిట్లు, చివాట్లు, వేల అవతారాలు… డైరెక్టర్ గా మారిన నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

నటులు దర్శకులు గా మారిన దాఖలాలు టాలీవుడ్ లో ఎక్కువనే చెప్పాలి. మరీ ముఖ్యంగా హీరోలుగా రాణించిన ఎంతో మంది నటులు తర్వాత కాలంలో దర్శకుడిగా మారి తమ లక్ పరీక్షించుకున్నారు. అయితే కేవలం మూడు నాలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న ఒక నటుడు ఇప్పుడు దర్శకుడిగా మారిన అంశం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

అభిషేక్ మహర్షి

అభిషేక్ మహర్షి

అభిషేక్ మహర్షి, ఈ పేరు యూట్యూబ్ లో లో ఉన్న వారికి కాస్త పరిచయమే. ఎందుకంటే నటుడిగానే కాక కొన్ని ఇంటర్వ్యూలలో కూడా ఆయన యాంకర్ గా వ్యవహరించాడు. అలా అలా మొత్తం మీద ఆయన ఎనిమిది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాక యూట్యూబ్ లో కూడా ఆయన దాదాపు అందరికీ పరిచయమే అనే చెప్పాలి.

ఎనిమిది సినిమాల్లో నటించి

ఎనిమిది సినిమాల్లో నటించి

తెలుగులో నందు హీరోగా వచ్చిన బెస్ట్ యాక్టర్ అనే సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన తర్వాత నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్, తను నేను, పైరేట్స్ 1.0, ఆ తర్వాత అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, జెస్సి, మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించాడు. అయితే గత కొన్ని ఏళ్లుగా దర్శకత్వం చేయాలని ప్రయత్నాలు చేస్తున్న అభిషేక మహర్షికి ఎట్టకేలకు కాలం కలిసి రావడంతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 సంతోష్ శోభన్ తో

సంతోష్ శోభన్ తో

తను నేను సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ ఈ మధ్య కాలంలోనే ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీరిద్దరూ కలిసి తను నేను సినిమా చేసినప్పటి పరిచయంతో కథ చెప్పి ఫైనల్ చేయించుకో గలిగాడు అభిషేక్ మహర్షి. ఈ సినిమా ప్రకటన కూడా ఈ రోజు వెలువడింది. అయితే సినిమా ప్రకటన సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తిట్లు, చివాట్లు, వేల అవతారాలు

తిట్లు, చివాట్లు, వేల అవతారాలు

''ఎన్నో నిద్ర లేని రాత్రులు, కలలు, తిట్లు, చివాట్లు, భుజం మీద తట్టి ఇచ్చినా ప్రశంసలు, గమ్యం చేరడం కోసం చేసినా బోలెడన్ని పనులు, బతకడం కోసం ఎత్తిన వేల అవతారాలు, ఫలించని ప్రయత్నాలు, గుర్తింపులేని కష్టం, అవమానాలు వీటన్నిటిలో పక్కనే నుంచొని మేమున్నామని నా వాళ్ళు ఇచ్చినా భరోసా కలిసి నా ఈ మొదటి చలన చిత్రం ప్రేమ్ కుమార్. నన్ను నమ్మిన కొందరికి, నమ్మని చాలా మందికి ధన్యవాదాలు'' అంటూ ఆయన రాసుకొచ్చారు.

Recommended Video

Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్

80 శాతం షూట్ పూర్తి

రాశీ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ చైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు కూడా నటిస్తున్నారు. ఆల్రెడీ 80 శాతం షూట్ కూడా పూర్తయిన ఈ సినిమా మిగతా షూట్ లాక్‌డౌన్ తర్వాత పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X