‘ఉదయ్ కిరణ్ చనిపోవడమే బెటర్.. చాలా హింసించారు’

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి 10 ఏళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించారు. ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలు, యువతను ఆకట్టుకునే సినిమాల్లో నటించి సక్సెస్ అయ్యారు. అప్పట్లో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. కానీ చివరకు ఆయన చిన్న వయస్సుల్లోనే తుది శ్వాస విడవటం అందరిని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ డెత్ పై బిగ్ బాస్ విజేత కౌశల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఉదయ్ కిరణ్ ఎంత కష్టపడ్డాడో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఉదయ్ కిరణ్ కు క్లోజ్ ఫ్రెండ్..
లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు 'చిత్రం' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. దర్శకుడు తేజా ఉదయ్ కిరణ్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత నుంచి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి కంటే ముందు చాలా కష్టపడ్డాడని అతని క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ షైన్ అయిన తర్వాత ఎంతో మంది దగ్గర అయ్యినప్పటికీ తను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే ఉదయ్ కిరణ్ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చాడు. బెగంపేట్ లోనే ఉండేవారని, సినిమా అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డాడని కౌశల్ చెప్పాడు.

Actor Uday Kiran Suicide

అతను బతికి లేనిదే మంచిది : కౌశల్
ఉదయ్ కిరణ్ 33 ఏళ్లకే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం మిస్టరీగా మారింది. ఇక తాజాగా కౌశల్ ఉదయ్ కిరణ్ డెత్ పై స్పందించారు. ఆయన బతికి ఉండే దానికంటే.. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న వాతావరణం దృష్ట్యా లేనిదే మంచిదని అభిప్రాయ పడుతాను. ఒక స్నేహితుడిగా అలా అనకూడదు. కానీ ఉదయ్ ఎంతో కష్టపడి ఎదిగాడు. సాధారణంగా సోసైటీలో ఎదిగే వాడిని కిందికి లాగే వారు ఎక్కువ అయ్యారు.

25 ఏళ్లుగా నేను చిత్ర పరిశ్రమను లోపల, బయట చూస్తున్నాను. ఎదిగివారి ఎంతగానో హింసిస్తారు. దాని వాళ్ల వారికి కూడా ఎలాంటి ప్రజయోజనం ఉండదు. కానీ అదొక ఆనందం వారికి. అలాంటి వారితో చాలా ప్రమాదం అని చెప్పుకొచ్చారు. ఇక ఉదయ్ కిరణ్ తో తను కలిసి పదమూడు చిత్రాలకు పైగా నటించానని చెప్పారు. చాలా మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చారు. మరోవైపు మంచు విష్ణు కూడా చాలా మంచి వ్యక్తి అని. ఆయనపై కూడా విషయంలో ట్రోల్స్ కాస్తా బాధగా అనిపించిందన్నారు.

ఉదయ్ కిరణ్ గుర్తుండిపోయే సినిమాలు..
ఉదయ్ కిరణ్ తెలుగులో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కదన్నా వంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు. ఇక కౌశల్ తాజాగా కన్నప్ప చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

More from Filmibeat

Read more about: kaushal uday kiran kannappa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X