హీరోయిన్ ఆ పార్ట్ అంటే జేడీ చక్రవర్తికి ఆ పిచ్చి.. అర్ధరాత్రి అలాంటి పని చేసేవాడట!

తెలుగు సినిమా దశని, దిశని మార్చిన క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ పరిశ్రమకు పరిచయం చేసిన నటీనటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే, విలన్‌గానూ ఆకట్టుకున్నారు. తర్వాతి రోజుల్లో హీరోగా, నటుడిగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మిగిలిన హీరోల మాదిరిగా కమర్షియల్, రోటీన్ ఫార్మూలా అనే మూసలో కొట్టుకుపోకుండా విభిన్నమైన రోల్స్ చేస్తూ వర్మకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో, గడ్డంతో జులాయిలా జేడీ చక్రవర్తి తెరపై కనిపిస్తే చాలు అమ్మాయిలు.. రౌడీగాడు వచ్చాడ్రా అనుకునేవారు. కానీ తర్వాతి రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలకు ఆయన కలల రాకుమారుడు అనుకున్నారు.

actor uttej made sensational comments on jd Chakravarthy and actress rambha

టీవీల్లో జేడీ చక్రవర్తి పాట వస్తోందంటే.. అమ్మాయిలు పరుగులు తీసి మరీ చూడటం నేను చూశానని మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి అన్నారంటే జేడీకి లేడీస్‌లో ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనగనగా ఒకరోజు, వన్‌బై టూ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమకు వేళాయెరా వంటి చిత్రాలు జేడీ చక్రవర్తికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే తర్వాత ఎందుకో ఆయన సినీ పరిశ్రమకు దూరమయ్యారు. కానీ మళ్లీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓటీటీలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా సినిమాలలోనే కాకుండా, ఆర్జీవీ విలక్షణ వ్యక్తిత్వానికి కూడా జేడీ చక్రవర్తి వారసుడిగా నిరూపించుకున్నారు. హీరో, విలన్, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని అన్ని రకాల టాలెంట్లను తెరపై చూపించిన జేడీ.. వ్యక్తిగత జీవితంలోనూ గురువు బాటలోనే అడుగులు వేశారు.

పెళ్లి, పిల్లలు అనే పదాలకు దూరంగా ఒంటరిగా ఉండటానికే ఆయన ఎక్కువ ఇష్టపడ్డారు. సోలో లైఫే సో బెటర్ అంటూ, మరో మనిషితో జీవితం పంచుకోవాలనే ఆలోచన రావట్లేదని పలు మార్లు చెప్పాడు. అయితే తన 46వ ఏట బ్రహ్మచర్యానికి స్వస్తి పలికిన జేడీ చక్రవర్తి .. సినీనటి అనుకృతి శర్మను వివాహం చేసుకున్నారు. పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరిపించి తన మార్క్ చూపించారు.

actor uttej made sensational comments on jd Chakravarthy and actress rambha

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే జేడీ చక్రవర్తి.. తన ముక్కుసూటితనంతో కాంట్రవర్సీల్లో నిలిచారు. సీరియస్‌గా కనిపించే మనోడిలో చిలిపి కృష్ణుడు కూడా ఉన్నాడంటారు ఆయన మిత్రులు. సినీనటుడు ఉత్తేజ్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జేడీ చక్రవర్తి ఓ హీరోయిన్ తొడలు చూసేందుకు అర్ధరాత్రుళ్లు వెళ్లేవాడట. ఆమె ఎవరో కాదు రంభ. పంజాగుట్టలో రంభ కటౌట్ ఒకటి పెద్దది ఉండేదని, అక్కడికి వెళ్లి లో యాంగిల్‌లో రంభ తొడలు చూసి ఇంటికి వచ్చేవాళ్లమని ఉత్తేజ్ వ్యాఖ్యానించారు.

రంభ అంటే జేడీకి చాలా ఇష్టమని.. ఆమె కటౌట్ చూడటానికి వెళ్లినవాడు, రంభతోనే కలిసి సినిమా చేసే స్థాయికి ఎదిగాడని ప్రశంసించారు. నేను, జేడీ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని ఉత్తేజ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: jd chakravarthy tollywood uttej
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X