అక్కినేని ఫ్యాన్స్ కు వెంకీ మామ సర్రైజ్.. చైతూ పెళ్లిలో స్పెషల్ అట్రాక్ట్ ఆమెనే..

Naga Chaitanya - Sobhita: అక్కినేని నాగచైతన్య - శోభిత వివాహం డిసెంబర్ 4 ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరుకుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం శోభిత చైతులపెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు.. నవ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కామెంట్ల రూపంలో అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ కొన్ని స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో చేశారు.

నాగచైతన్య - శోభిత వివాహం ఎంత వైభవంగా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరావు గారి విగ్రహం ఎదుట పెళ్లి వేడుకు నిర్వహించారు. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో చైతూ - శోభితలు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ జంట కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్, దగ్గర బంధువులు, ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీస్ విచ్చేశారు. వీరి వివాహా వేడుకలో సందడి చేశారు.

Actor Venkatesh shared Naga Chaitanya - Sobhita s wedding some special photos on social media

ఈ నేపథ్యంలో అక్కినేనీ నాగార్జున స్పెషల్ గా రెండు ఫోటోలను షేర్ చేశారు. పెళ్లి తర్వాత కొత్త జంటతో పాటు అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ఏఎన్నార్ విగ్రహం ముందు ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'ఈ బ్యూటిఫుల్ మూమెంట్ విచ్చేసిన నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ కు అభినందనలు, మీ బ్లెస్సింగ్స్, మీరిచ్చే గౌరవం మరింత ఆనందాన్ని ఇచ్చింది. మీ ప్రేమతో ఈ వేడుక మరింత గుర్తుంచుకునేలా మారింది. ఇది నా కొడుకు వివాహ వేడుకనే కాదు.. ఓ మధుర జ్ఞాపకం కూడా.. అక్కినేని ఫ్యామిలీ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'అని పోస్ట్ చేసారు.

ఇదిలాఉంటే.. అక్కినేని ఫ్యాన్స్ కు విక్టరీ వెంకటేష్ ఓ సర్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. వాస్తవానికి చైతూ పెళ్లి సందడి వారం రోజులు ముందుగానే మొదలైంది. పెళ్లికి ముందు రోజు రామానాయుడు గారి ఇంట్లో నాగ చైతన్యను పెళ్లి కొడుకుని చేశారు. ఆ పెళ్ళికొడుకు ఈవెంట్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని వెంకటేష్ గారు తన సోషల్ మీడియా వేదికగా మొదటిసారి పంచుకున్నారు.

ఈ ఫోటోలలో నాగ చైతన్య తల్లి లక్ష్మీ గారు, రామానాయుడు గారి భార్య కూడా ఉన్నారు. ఈ ఫ్యామిలీ ఫొటోస్ అందరికీ బాగా కట్టుకుంటున్నాయి. ప్రేమ, సంతోషంతో ఈ వివాహ వేడుకను కుటుంబ సభ్యులందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు వెంకటేష్. ప్రస్తుతం వెంకీ మామ ఫొటోలు ప్రస్తుతం నేటిలో హల్చల్ చేస్తున్నాయి. ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ ను మీరు కూడా ఓ లూక్కేయండి.

More from Filmibeat

Read more about: naga chaitanya shobhita venkatesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X