Actor Venu Madhav Death: వీవీ వినాయక్ స్పందన.. ప్రగాఢ సంతాపం
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతిపై డైరెక్టర్ వీవీ వినాయక్ స్పందించారు. మంచి టాలెంట్ ఉన్న కమెడియన్ వేణు మాధవ్ అని పేర్కొంటూ ఆవేదన చెందారు. వేణు మాధవ్ తాను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ నటించారని చెప్పారు. మంచి ఆత్మీయుడిని కోల్పోయానని ఫీల్ అవుతున్నానని అన్నారు.
వేణు మాధవ్ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎన్నో సినిమాల ద్వారా కామెడీ పంచేవారని అన్నారు. సెట్లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వ్యక్తి వేణు మాధవ్ అని, తాను రాసిన స్క్రిప్ట్ కంటే మరింత బాగా ఆయన నటించేవారని గుర్తు చేసుకున్నారు. తాను డైరెక్ట్ చేసిన లక్ష్మి సినిమాకు గాను వేణు మాధవ్‌కి నంది అవార్డు లభించినప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యానని చెప్పారు వీవీ వినాయక్. ఈ మేరకు వేణు మాధవ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

గత కొద్దికాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవ్.. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. 'సంప్రదాయం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేణుమాధవ్ ఇండస్ట్రీలో అలుపెరగని ప్రయాణం చేశారు. 20 ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా కొనసాగిన ఆయన 400 పైగా సినిమాల్లో నటించారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తిగా ఉండే ఆయన వెండితెరపై రాణించారు. వేణు మాధవ్ ఇక లేరు అనే మాట విని ప్రేక్షకలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











