twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి కరోనాను జయిస్తాడు.. ఆయన ఎప్పటికీ చిరంజీవియే.. ప్రముఖ నటుడి విషెస్

    |

    మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అనే విషయం బయటకు రాగానే అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సోమవారం ఉదయం తనకు కరోనా పాజిటివ్ అని తేలింది అంటూ ట్వీట్ చేయడంతో అందరూ షాక్ గురయ్యారు. ఆ తర్వాత చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులందరూ సోషల్ మీడియాలో స్పందించారు.

    చిరంజీవి కోవిడ్ బారిన పడ్డారనే విషయంపై ప్రముఖ నటుడు విజయ్ చందర్ స్పందించారు. మెగాస్టార్ కరోనావైరస్ నుంచి త్వరలోనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. లక్షణాలు లేకపోయినా ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిగా కరోనా టెస్టులు చేయించుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి త్వరలోనే కోలుకుని కొత్త ఉత్సాహంతో అభిమానులను అలరిస్తారు అని విజయ్ చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    Actor Vijay Chander wishes Chiranjeevi amid tested coronavirus positive

    చిరంజీవి ఇపుడు కరోనా యోధుడని, విజయంతో తిరిగి వస్తారు. సినీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకున్న శ్రీ చిరంజీవి నటించబోయే కొత్త సినిమా కోసం వెయికళ్ళతో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించిన చిరంజీవి ఎప్పటికీ జనహృదయాల్లో చిరంజీవియే అని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ చందర్ తెలిపారు.

    ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా సోకిన విషయాన్ని చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ట్వీట్ చేసి.. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    English summary
    Popular Actor Vijay Chander wishes Megastar Chiranjeevi who tested Coronavirus positive. He released a statement and wishes for speed recovery from the Covid 19. On Monday, Chiranjeevi tweets about his coronavirus positive status.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X