Don't Miss!
- News
ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ - "చేదోడు" అక్కడి నుంచే..!!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Sports
Team India : అవకాశాలు అన్నీ వేస్ట్.. చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడు చేశావ్..?
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
షూట్ లో ప్రమాదం.. ఆయన తప్పేమీ లేదంటూ ట్వీట్ చేసిన విశాల్!
తమిళంలో స్టార్ హీరోగా ఉన్న విశాల్ తెలుగులో కూడా చాలా ఫేమస్. దాదాపు ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. స్వతహాగా తెలుగువాడైన విశాల్ తమిళంలో హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆయన హీరోగా నటిస్తున్న 31వ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన షూటింగ్లో ఆయనకు ప్రమాదం జరిగిందని నిన్నటి నుంచి పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని విషయాలు ఒక వీడియో ద్వారా వెల్లడించారు.
ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో తృటిలో ప్రమాదం తప్పిందని అయితే ఇందులో స్టెంట్ మాన్ తప్పేమీ లేదని పేర్కొన్నారు ఆయన. కేవలం మిస్ టైమింగ్ వల్ల తన తలకు సీసా తగిలింది అని చెప్పుకొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇలాంటి పొరపాట్లు జరగడం సహజం అని ఆయన పేర్కొన్నారు. అంతేకాక దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులు వల్ల తనకు ఏమీ కాలేదని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. మిగతా షూటింగ్ కూడా హైదరాబాదులో జరుగుతోందని ఆయన వెల్లడించారు.

ఇక ఫైట్ మాస్టర్ రవివర్మకు ధన్యవాదాలు తెలిపిన విశాల్ ఈ ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చిందని చూడడానికి ఒక ట్రీట్ లాగా ఉంటుందని వెల్లడించారు. పీ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలబడుతుందని చెబుతున్నారు. అయితే డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో విశాల్ కు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు విశాల్ కు పెద్దగా గాయాలు కూడా కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన కొన్ని సెకన్ల వీడియోని విశాల్ షేర్ చేయగా ఆ వీడియో చూస్తుంటేనే ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అని ఆసక్తి జనాల్లో పెరిగిపోతోంది.