Vishal: అవార్డులపై నమ్మకం లేదు.. ఒకవేళ ఇచ్చినా.. : విశాల్
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆయన ప్రస్తుతం తగ్గించిన సినిమాల తర్వాత నిర్మాతగా మారి పలు ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తున్నారు. అయితే.. తన సినిమాలతోనే కాదు.. తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తారు. తాజాగా తన వ్యాఖ్యలతో సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఈసారి జాతీయ సినిమా అవార్డులపై హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాడు. ఇంతకీ హీరో విశాల్ ఏమన్నారంటే?
హీరో విశాల్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించడం బాగా తగ్గించేశారు. ఆయన చివరిసారిగా మదగజరాజా సినిమాలో నటించారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడో పూర్తయిన వివిధ కారణాలతో చాలా ఆలస్యంగా రిలీజైంది. అయితే ఈ మధ్యలో పలు అనారోగ్య సమస్యలతో సతమతమయ్యాడు విశాల్. బాగా బక్కచిక్కిపోయి కనిపించారు. అయితే ఇప్పుడు మళ్లీ కుదురుకున్న ఈ యాక్షన్ హీరో మళ్లీ సినిమా షూటింగులతో బిజీగా మారాడు. ప్రస్తుతం తన 35 వ సినిమా 'మకుటుం' షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు విశాల్.

ఈ సందర్భంగా ఓ చిట్ చాట్ షోలో పాల్గొన్న హీరో విశాల్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే.. జాతీయ సినిమా అవార్డులపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. అవార్డులపై నమ్మకం లేదని, అవి "బుల్‌షిట్" అని బహిరంగంగానే చెప్పేశాడు. విశాల్ మాట్లాడుతూ "నేను అవార్డుల మీద విశ్వాసం పెట్టుకోను. అవార్డ్స్ అన్నీ బుల్‌షిట్. 8 మంది కూర్చుని 8 కోట్లు మంది ఇష్టపడే సినిమాని ఎలా నిర్ణయిస్తారు? నేను చెబుతున్నది జాతీయ అవార్డ్స్ గురించీ కూడా. అవార్డులు ఇవ్వకపోవడమే కాదు, ఇచ్చినా నేను వాటిని డస్ట్‌బిన్‌లో వేసేస్తాను." అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విశాల్ మాట్లాడుతూ తనకు ప్రేక్షకుల ప్రేమే నిజమైన అవార్డు అని తెలిపారు. "నేను అవార్డుల కోసం సినిమాలు చేయను. ప్రేక్షకుల స్పందన, వాళ్లు ఇచ్చే చప్పట్లే నా అవార్డులు. నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్‌లు ఎవరికీ ఉపయోగం లేవు. నిజమైన టాలెంట్‌ని పబ్లిక్ మాత్రమే గుర్తిస్తారు" అని అన్నారు. ప్రస్తుతం హీరో విశాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య చర్చనీయాంశమయ్యాయి. కొందరు "విశాల్ నిజం చెప్పాడు" అని ఆయనను సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు "జాతీయ అవార్డ్స్‌ను తక్కువగా అంచనా వేయకూడదు" అంటూ విమర్శిస్తున్నారు.
ఇంటర్వ్యూలో తన యాక్షన్ లైఫ్ గురించి కూడా విశాల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "నేను సినిమాల్లో డూప్స్ వాడను. అన్ని యాక్షన్ సీన్స్ నేనే చేస్తాను. అందుకే ఇప్పటివరకు నా శరీరంపై 119 కుట్లు పడ్డాయి. కానీ ప్రేక్షకుల స్పందన చూసి ఆ బాధ అంతా మరిచిపోతాను" అని విశాల్ చెప్పారు. వాస్తవానికి విశాల్ తన యాక్షన్ సీన్స్‌కి రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడంలో ఎప్పుడూ రిస్క్ తీసుకోవడంలో వెనుకడుగు వేయడు.
ఇటీవల విశాల్ తన ప్రియురాలు సాయి ధన్సికతో సింపుల్ ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే పెళ్లి మాత్రం నడిగర్ సంఘం భవనం పూర్తి అయిన తర్వాతే చేసుకుంటానని తెలిపారు. విశాల్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అభిమానులు, విమర్శకులు ఇద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు ఆయన మాటలు వివాదానికి దారితీస్తాయని అంటున్నారు. మొత్తానికి విశాల్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications











