Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియురాలితో పెళ్లికి సిద్దమైన వైవా హర్ష.. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్.. అతిధులుగా మెగా హీరోలు, కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది ఏ స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఏడాది కూడా పెళ్లిళ్లు చాలానే జరగనున్నట్లు తెలుస్తోంది. ఒక సింగర్ అండ్ కమెడియన్ పెళ్లి వార్తలతో వైరల్ అయ్యారు. సింగర్ సునీత రెండో పెళ్లితో సరికొత్త జీవితాన్ని మొదలు పెడుతుండగా వైవా హర్ష కూడా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల ఎంగేజ్మెంట్ కూడా పూర్తయ్యింది.
ట్రెండ్ షేర్ చేసిన హర్ష
వైవా హర్ష అంటే తెలియని నెటిజన్లు ఉండరు. సోషల్ మీడియా ద్వారా కూడా సినిమాల్లో ఛాన్సులు అందుకోవచ్చని డిఫరెంట్ స్టైల్ లో ట్రెండ్ సెట్ చేసిన వారిలో వైవా హర్ష ఒకరు. యూ ట్యూబ్ వీడియోలు ద్వారా దాదాపు సెలబ్రెటీల రేంజ్ లో క్రేజ్ అందుకున్నడు. ఇక మెల్లగా సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసి కమెడియన్ గా కూడా క్లిక్కయ్యాడు.
మెగా హీరోలతో అనుబంధం
వైవా హర్ష అంటే ఇప్పుడు సినీ ప్రముఖులకు కూడా చాలా సన్నిహితంగా ఉండే కమెడియన్ అనే చెప్పాలి. ఒక్కసారి హర్షతో కలిసి వర్క్ చేస్తే వారంతా కూడా క్లోజ్ ఫ్రెండ్ అవ్వాల్సిందే. మెగా ఫ్యామిలీలో సాయి ధరమ్ తేజ్ బ్రదర్స్ మనోడికి చాలా మంచి స్నేహితులు. ఇక వారు ఎంగేజ్మెంట్ కు కూడా వచ్చారు.
గ్రాండ్ గా ఎంగేజ్మెంట్
వైవా హర్ష, అక్షర అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ఇటీవల గ్రాండ్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వేడుకకు కొంతమంది సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. సాయి ధరమ్ తేజ్ తో ఎప్పటి నుంచో స్నేహం ఉంది కాబట్టి ఫంక్షన్ లో అతనే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
హోస్ట్ గా కూడా.. బిజీబిజీగా
మెగా మేనల్లుళ్లు అలాగే మెగా డాటర్ సుస్మిత కూడా నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్నారు. ఆమె భర్త విష్ణు ప్రసాద్ కూడా వచ్చారు. వారు కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్న వెబ్ సిరీస్ లో హర్ష నటిస్తున్నాడు. ఇక ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్వించే హర్షతో అందరూ క్లోజ్ గానే ఉంటారు. ఇటీవల కలర్ ఫొటో సినిమాతో సరికొత్తగా ఆకట్టుకున్న హర్ష ఆహాలో ఒక షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.