నా ఆస్తుల లెక్క ఇదే.. పవిత్రతో రిలేషన్ పై మహేష్ ఏమన్నారంటే: నరేష్ క్లారిటీ

టాలీవుడ్ లో సీనియర్ యాక్టర్ నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ లివింగ్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి జీవితాలలో జరిగిన సంఘటనలతో మళ్ళీ పెళ్లి అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మూడో భార్య కి విడాకుల కోసం నరేష్ ఇప్పటికే అప్లై చేశారు. పవిత్ర లోకేష్ కూడా భర్తతో తెగతెంపులు చేసుకుంది. ఇక ఈ తరుణంలో వీరి మళ్ళీ పెళ్లి సినిమా విడుదలవుతుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో నరేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఆ సినిమా నుంచి : నరేష్, పవిత్ర సమ్మోహనం సినియాలో కలిసి నటించారు. తరువాత పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిపై సోషల్ మీడియాలో చాలా రకాల ప్రచారాలు నడిచాయి. ఒకానొక దశలో అయితే పవిత్ర లోకేష్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే వీరి బంధానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉందా అంటే అవుననే చెబుతున్నారు.

 nareshmaheshpavithra

క్లారిటీ ఇచ్చిన నరేష్ : సూపర్ స్టార్ గౌరవాన్ని నరేష్ మంటగలిపారు అంటూ చాలా ప్రచారం చేశారు. అలాగే విజయ నిర్మల ఇమేజ్ ని కూడా నరేష్ దెబ్బ తీసారని విమర్శలు గుప్పించారు. తాజాగా నరేష్ ఇంటర్వ్యూలో పవిత్రతో తన బంధంపై కుండబద్దలు కొట్టి చెప్పారు. అసలు మా బంధంపై సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

 nareshmaheshpavithra

మహేష్ కు ముందే తెలుసు : సూపర్ కృష్ణతో పాటు మహేష్ బాబుకి ముందు నుంచి పవిత్ర లోకేష్ తో నా రిలేషన్ గురించి తెలుసు. వారు బంధానికి ఎలాంటి అడ్డు చెప్పలేదని, అందరూ తన నిర్ణయాన్ని గౌరవించారని నరేష్ క్లారిటీ ఇచ్చారు. కృష్ణ, విజయ నిర్మల, మహేష్ బాబుతో పాటు అందరం ఒకే కుటుంబ సభ్యులమని నరేష్ చెప్పుకొచ్చారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణకి పవిత్ర మంచి వంటలు వండి పెట్టెదని కూడా నరేష్ చెప్పడం విశేషం. అలాగే పవిత్రకి తెలుగు పెద్దగా రాదని ఇంగ్లీష్ లోనే కృష్ణగారు మాట్లాడేవారని పవిత్ర చెప్పుకొచ్చారు. ఇక తమ బంధానికి కుటుంబ సభ్యులు అందరి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించడం చాలా సంతోషంగా ఉందని నరేష్, పవిత్రలు ఇంటర్వ్యూలు పేర్కొన్నారు.

 nareshmaheshpavithra

వెయ్యి కోట్ల ఫిగర్ : ఈ నేపథ్యంలో మళ్ళీ పెళ్లి సినిమాలో వెయ్యి కోట్ల ఫిగర్ అంటూ నరేష్ ని ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ పై ఇంటర్వ్యూలో అతనికి ప్రశ్న ఎదురైంది. నిజంగానే మీ ఆస్తి వెయ్యి కోట్లు ఉంటుందా అని అడిగారు. వెయ్యి కోట్లకి పైనే ఉండొచ్చని నరేష్ క్లారిటీ ఇచ్చారు. లెక్కలు వేయలేదని అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉందని, అలాగే తాను కూడా సంపాదించినది భూముల మీద పెట్టానని ఇప్పుడు వాటి విలువ పెరిగిందని చెప్పారు.

 nareshmaheshpavithra
గౌరవంగా సంపాదించిందే : అయితే తన ఆస్తిలో అంతా వైట్ మనీ తప్ప బ్లాక్ అనేది ఉండదని, గౌరవంగా సంపాదించిందే అని క్లారిటీ ఇచ్చారు. అలాగే తన తల్లి వారసత్వంగా ఆస్తి ఇవ్వడంతో పాటు చాలా నిజాయితీని కూడా అందించింది అని నరేష్ తెలిపారు. దీనిని చాలా సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల కంటే నరేష్ కోటీశ్వరుడు అని ఆయన మాటలతోనే క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. అలాగే పరోక్షంగా చాలా మంది దగ్గర ఇండస్ట్రీలో బ్లాక్ మనీ కూడా ఉందని కామెంట్స్ చేసినట్లు అయ్యిందనే టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X