Naresh: మహేష్ బాబు మీద ఈగ వాలినా... యానిమల్ రేంజ్‌లో వీకే నరేష్ వార్నింగ్

విజయ నిర్మల కుమారుడు వీకే నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాల్లో హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వీకే నరేష్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక ఘట్టమనేని కుటుంబం గురించి, మహేశ్ బాబు గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేసిన నరేష్.. మహేశ్ బాబు మీద ఈగవాలినా ఊరుకోను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే...

వీకే నరేష్... సినిమాలతో, వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారనే సంగతి తెలిసిందే. ఇక తన భార్యకు విడాకులు ఇచ్చి ఇటీవల పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడంతో.. వార్తల్లో హైలెట్ అయ్యారు. ఇక పవిత్ర లోకేష్, నరేష్ ఒక్కటి కావడంతో.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పవిత్ర లోకేష్, నరేష్ బిజి బిజిగా ఉన్నారు. వరుస సినిమాలతో ఈ జంట దూసుకుపోతుంది.

Actor VK Naresh Comments on Mahesh Babu and GunturKaaram Movie Result News Goes Viral

ఇక నరేష్ ఇటీవల 50 సంవత్సరాల తన సినీ కెరియర్ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని... ఆయన గురించి, తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. నరేష్ ఈ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కృష్ణ విజయం నిర్మల మరణించిన తర్వాత తమ జీవితాల గురించి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి నెట్టింట వైరల్ గా మారాయి.

చిన్నప్పుడు నేను మహేష్ అందరూ కూడా బాగా కలిసి ఉండే వాళ్ళమన్న నరేష్.. కృష్ణ గారు అమ్మ విజయనిర్మల వెళ్లిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అయిందని చెప్పుకువచ్చారు. కుటుంబంలో అందరికంటే పెద్దవాడిగా నేనున్నానని తమ ఫ్యామిలీపై ఈగ వాలకుండ చూసుకొనే బాధ్యత తనదంటూ సంచలన వ్యాఖ్యలు చేశఆరు. మహేశ్ ఫ్యామిలీకే కాదు... అందరికీ నేను అండగా ఉంటానని యానిమల్ సినిమాలోని డైలాగ్ తరహాలో చెప్పుకువచ్చారు.

కృష్ణ గారి తర్వాత అదే క్రేజ్ మహేష్ బాబు కొనసాగిస్తున్నారని నరేష్ అన్నారు. కృష్ణ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మహేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మహేష్ సినిమాల ఫలితాల గురించి అందరికీ తెలిసిందేనని... సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తాయని చెప్పుకువచ్చారు.

ఇటీవల గుంటూరు కారం సినిమాలో మహేశ్ నటించారు. ఇక ఆ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగా వస్తున్నాయి. దీని గురించి కూడా నరేష్ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పనులు మొదలు పెట్టనున్నారనే సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X