’AP Elections 2024 ఏపీకి పవన్ టార్చ్ బేరర్.. పాలకుల విధ్వంసం అంటూ‘
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న కొందరిపై వీకే నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారిపై పవన్ కల్యాణ్ స్పీచ్‌ను, వ్యాఖ్యలను వక్రీకరించారు. అందుకు సాక్ష్యం అంటూ ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ఆ వీడియోలో పవన్ ఏం మాట్లాడారనే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. వీకే నరేష్ చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..
ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉన్నప్పటికీ.. పరిశ్రమ ఒక కుటుంబంగానే ఉండేది. ఏనాడు ఒకరిపై మరొకరు వ్యక్తిగతం బురద జల్లుకొనే ప్రయత్నాలు చేయలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కృష్ణ గారు కాంగ్రెస్‌లో ఉండేవారు. అయితే రాజకీయ విమర్శలే చేశారు. కానీ వారు వ్యక్తిగతంగా దూషించుకోలేదని అన్నారు.

అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేయడాన్ని గ్రహించిన వీకే నరేష్.. సూపర్ స్టార్ కృష్ణ వీడియోను కూడా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎన్టీఆర్ గురించి కృష్ణ స్పీచ్‌ను తమ అభిమానులకు అందించారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించాలని ప్రార్థిస్తున్నాం. సినిమా పరిశ్రమలోని ప్రతీ ఒక్కరు ఐక్యంగా, ఒక కుటుంబంలా ఉండాలని మాజీ మా అధ్యక్షుడిగా, సీనియర్ యాక్టర్‌గా కోరుకొంటున్నాను. మనమంతా ఏకతాటిపైకి రావాలని విన్నవించుకొంటున్నాను అని వీకే నరేష్ రిక్వెస్ట్ చేశారు.
సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన సూత్రాన్ని పాటించాలి. ఏదైనా మంచి ఉంటే మైకులో చెబుదాం. ఏదైనా చెడు ఉంటే చెవిలో చెప్పుకొందాం అని చిరంజీవి చెప్పిన ఓ పాఠాన్ని తన ట్వీట్‌లో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











