VK Naresh ఏపీ రాజకీయాలపై వీకే నరేష్ సంచలనం.. రక్తం చిందాల్సిందే అంటూ!
ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికల పండగ రాబోతుంది. ఇప్పటికే అక్కడ నువ్వా నేనా అన్నట్లు ప్రతిపక్షాలు, అధికార పక్షం పోటీ పడి మరీ ప్రచారం మొదలుపెట్టారు. ఇక జగన్ ఒకవైపు ఉంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ అంతా మరోవైపు కూటమిగా నిలిచారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో తెలియదు కానీ... నటుడు వీకే నరేష్ మాత్రం సంచలన ట్వీట్ వేశారు. అధికార మార్పిడి జరగాలంటే.. రక్తం చిందాల్సిందే అంటూ రాసుకువచ్చారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
ఏపీలో మరికొద్ది మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత జరగబోతున్న 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు హోరాహోరిగా బరిలోకి దిగుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు పార్టీలు తమ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీని ఓడించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసి బరిలోకి దిగారు. పవన్ అయితే రోడ్ షోస్ అంటూ సినిమాలకు స్వస్తి చెప్పి ప్రచారంలో దిగారు.

ఇక అటు బాలయ్య కూడా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తన 109వ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా లేదు. ఎన్నికల ఫలితాల తర్వాతే సినిమా రానుందని తెలుస్తోంది. ఇక ఆ విషయం పక్కన పెడితే... నటుడు వీకే నరేష్ ఏపీ రాజకీయాలపై వేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తుంది. ఏపీ ఎన్నికలకు ముందు రక్తపాతం జరిగే అవకాశం ఉందని ఆయన తన ట్విట్టర్ వేదికగా చెప్పుకువచ్చారు.
నరేష్ తన ట్విట్టర్ వేదికగా.... ''ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగే ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఉంది'' అంటూ రాసుకువచ్చారు. ఇప్పుడు ఇదే విషయం మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసిన నరేష్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక కొన్నాళ్ల క్రితం ఆయన పవిత్ర లోకేష్ తో వివాహం వ్యవహారంలో ఎక్కువగా వార్తల్లో నిలిచారు.
ఇప్పుడు మరోసారి తన ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారిపోయారు. అసలు అధికార మార్పిడికి.. రక్తం చిందాల్సిన అవసరం ఏముంది.. ఎవరి రక్తం.. ఇంకా ఎవరైనా చనిపోతారా.. చంపేస్తారా అనేది నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో ఫ్యాక్షన్స్ గొడవలు ఎక్కువ. ఈ ట్వీట్ తో ఇప్పుడు అక్కడ మరింత కలవరం రేకిత్తించినట్లు అయింది. చూడాలి మరి. ఇక నరేష్ ప్రస్తుతం తన నాలుగవ భార్య లోకేష్ తో ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్నారు. పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











