హోటల్ గదిలోరెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన పవిత్ర నరేష్, చెప్పుతో కొట్టబోయిన నరేష్ మూడో భార్య
గత కొన్ని రోజులుగా యాక్టర్ VK నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూ నరేష్ అలాగే అతని మాజీ భార్య వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో మైసూర్లో నరేష్ పవిత్ర ఒక హోటల్లో కనిపించడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఎంట్రీ ఇచ్చిన నరేష్ మూడో భార్య రమ్య వారిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తీవ్ర స్థాయిలో విమర్శలు
ప్రముఖ నటుడు VK నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నట్లు గత కొంతకాలంగానే అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్న సమయంలోనే నరేష్ మూడో భార్య కూడా సంచలన ఆరోపణలు చేసింది. పవిత్ర లోకేష్ పై కూడా ఆమె భర్త కూడా పలు రకాల నెగిటివ్ కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
మోసం చేశారు అని..
మంచి నటులుగా ఇండస్ట్రీలో గుర్తింపు అందుకున్న పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా వారి పర్సనల్ మ్యారేజ్ లైఫ్ పై ఇప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వివాదంకు మాత్రం ముగింపు కార్డు పడటం లేదు. రీసెంట్ గా నరేష్ భార్య పవిత్ర లోకేష్ పై నెగిటివ్ కామెంట్ చేసిన విషయం తెలిసింది. అంతేకాకుండా ఆమె మోసం చేస్తుంది అని నరేష్ కూడా తనను మోసం చేశాడు అని ఇంకా విడాకులు కూడా ఇవ్వలేదు అని అప్పుడే ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు అని ఆరోపణలు చేసిందే.

మైసూర్ హోటల్ లో నరేష్, పవిత్ర
అయితే రీసెంట్ గా పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా మైసూర్ లోని ఒక హోటల్ లో కనిపించడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. హఠాత్తుగా అక్కడికి ఎంట్రీ ఇచ్చిన నరేష్ భార్య రమ్య రఘుపతి ఒక్కసారిగా వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. ఆమెతోపాటు కొంతమంది సన్నిహితులు కూడా అక్కడ నరేష్ మోసగాడు అంటూ గట్టిగా అరుస్తూ తిట్టే ప్రయత్నం చేశారు.

చెప్పుతో దాడి
అయితే రమ్య కొంతసేపటి తర్వాత పోలీసులు అడ్డుకున్నప్పటికీ తన చెప్పుతో పవిత్ర లోకేష్ పై దాడి చేసే ప్రయత్నం చేసింది. లేడీ కానిస్టేబుల్స్ ఆమెను వెంటనే అడ్డుపడి నరేష్ పవిత్ర లోకేష్ బయటకు వెళ్లిపోయే విధంగా సహాయపడ్డారు. అయితే రమ్య రఘుపతి హడావిడి చూసిన తర్వాత నరేష్ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వకుండా విజిల్స్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడం విశేషం.
ప్రాణ హాని ఉంది
ఇదివరకే వీరికి సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతుండగా ఇప్పుడు మైసూర్ హోటల్లో తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటూ రమ్య ఆరోపణలు చేసింది. అంతేకాకుండా పవిత్ర లోకేష్ పై ఆమె దాడి చేసిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే నరేష్ ఇదివరకే తన మూడో భార్య నుంచి తనకు ప్రాణ హాని ఉంది అని కూడా ఆరోపించారు. తన నుంచి విడాకులు కావాలి అని గతంలో ఆమె డ్రైవర్ తో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.


Click it and Unblock the Notifications











