స్టార్ హీరోయిన్ కావాలంటే.. ఆ డైరెక్టర్‌తో అలాంటి శిక్ష అనుభవించాల్సేందేనా?

చిత్ర పరిశ్రమ సక్సెస్ వెంట నడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేసినా సరే ఒక్క ఫ్లాప్ వచ్చినా అడ్రస్ లేకుండా పోయినవాళ్లు ఎందరో. ఇక చిత్ర సీమలో సెంటిమెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా పేర్లు, హీరోయిన్, ముహూర్తాలు, సీజన్, విడుదల తేదీలు ఇలా ఇండస్ట్రీలో సెంటిమెంట్ చుట్టూ తిరిగే అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా అలాంటి కోవకే వస్తుంది.

చిత్ర పరిశ్రమలో ఎందరో డైరెక్టర్స్ ఉండగా కొందరే తమ ముద్ర వేశారు. కొందరు యాక్షన్ బాగా తీయగలరు.. ఇంకొందరు సెంటిమెంట్, మరికొందరు కామెడీ బాగా తీస్తారు . కానీ అన్ని రకాల జోనర్స్‌లో సినిమాలు తీయగల దర్శకులు అరుదు. ఇక ఇండస్ట్రీలో విలక్షణ దర్శకుడిగా ముద్ర వేయించుకున్నారు తమిళ దర్శక దిగ్గజం భారతీరాజా . డీ గ్లామర్ రోల్స్, నేచురల్ సినిమాలతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని ఆశించి సినిమాకు వచ్చేవారంటే అతిశయోక్తి కాదు.

actors who slapped by Director Bharathi raja became stars

నాలుగు భాషలకు చెందిన దర్శకుల దగ్గర పనిచేయడంతో పాటు భారతీరాజాకు సినిమాలపై పట్టు కుదిరింది. రోటీన్ కమర్షియల్ ఫార్మూలాకు భిన్నంగా విలక్షణ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు భారతీరాజా. పదునారు వయదినిలే సినిమా విజయంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత కిళక్కే పోగుం రైల్ , సిగప్పు రోజాక్కల్, 16 వయదినిలే, పుదియ వార్పుగల్, టిక్ టిక్ టిక్, మన్ వాసనై , ఒరు ఖైదియన్ డైరీ, కరుతమ్మ, సీతాకొక చిలుక తదితర చిత్రాలతో సౌత్‌లో ఆయన పేరు మారుమోగిపోయింది. చిరంజీవితో ఆరాధన, కృష్ణతో జమదగ్ని సినిమాలు తీశారు భారతీరాజా.

దాదాపు 48 ఏళ్ల సినీ జీవితంలో ఎందరో సినీతారలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. కార్తీక్, రాధ, రేవతి, రాధిక , విజయశాంతి, వడివుక్కరసి, చంద్రశేఖర్, పాండయన్, నెపోలియన్ వంటి స్టార్స్‌ను ఆయన పరిచయం చేసిన వారే. సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారతీరాజాకు పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి. భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో ఆయనను సత్కరించింది. సత్యభామ యూనివర్సిటీ భారతీరాజాకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.

ఇప్పుడంటే దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లు విలువ ఇవ్వడం లేదు కానీ పాత రోజుల్లో అందులోనూ భారతీరాజా దగ్గర వేషాలు వేస్తే అస్సలు ఊరుకునేవారు కాదు. నటీనటులు సరిగా సీన్ చేయకుంటే ఆయన ఏ మాత్రం మొహమాటం లేకుండా లాగి పీకేవారట. ఎంత పెద్ద స్టార్ అయినా, హీరోయిన్ అయినా ఆయన సహించేవారు కాదట. అంతేకాదు భారతీరాజా చేతులతో తన్నులు తిన్నవారు ఎందరో స్టార్స్‌గా వెలుగొందారు.

రేఖ, రాధిక, రేవతి, ప్రియమణి, రాధ వంటి టాప్ హీరోయిన్లు భారతీరాజా వద్ద తన్నులు తిన్నవారే. ఎక్కువగా సెంటిమెంట్ సీన్లు చేసే సమయంలోనే భారతీరాజా చేయి చేసుకునేవారట . షూటింగ్ సమయంలో నటీనటులతో ఆయన ఎంతో హుందాగా ఉండటంతో పాటు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చిన మేం స్టార్లు కావడానికి కారణమయ్యారని ఎందరో తెలిపారు. సో.. అదన్నమాట మేటర్.

More from Filmibeat

Read more about: bharathi raja movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X