తన ఆరోగ్యం వస్తున్న పుకార్లపై స్పందించిన నటి ఆమని.. అసలేం జరిగిందంటే..

తెలుగుదనం ఉట్టిపడే హీరోయిన్లలో సీనియర్ నటి ఆమని ఒకరంటే ఎలాంటి సందేహం అకర్లేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు. ఇటీవల సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఫీల్‌గుడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న పుకార్లపై ఆమని ఓ వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ... గత రెండు, మూడు రోజులుగా మీడియాలో నా ఆరోగ్యంపై రూమర్లు వస్తున్నాయి. ఆమనికి గుండెపోటు వచ్చింది. ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆరోగ్యం క్షీణించింది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు అనే వార్తలు, పుకార్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయనే విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదు అంటూ ఆమని క్లారిటీ ఇచ్చారు.

Actress Aamani quashes Heart attack rumours in media

నా ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మకండి. అవన్నీ రూమర్లే. ఇటీవల షూట్‌ కోసం మంచిర్యాల వెళ్లాను. అక్కడ ఫుడ్ పాయిజన్ కావడంతో నాతోపాటు 20 మందికి ఆనారోగ్యానికి గురయ్యారు. అంతేగానీ నాకు గుండెపోటు వచ్చిందనే వార్తల్లో నిజం లేదు. నేను బాగానే ఉన్నాను. ఇలా ఆర్టిస్టులపై పుకార్లు ప్రచారం చేసి ఎందుకు డిస్ట్రబ్ చేస్తున్నారో అర్ధం కావడంలేదు. ఇలాంటి వార్తలు నమ్మవద్దని వేడుకొంటున్నాను అని ఆమని తన వీడియోలో స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X