ఆ ప్రొడ్యూసర్ బట్టలు విప్పి చూపించమన్నాడు
Aamani: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సాధారణమంటూ పలువురు మహిళా నటులు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అది చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్స్ వరకు ఇండస్ట్రీలో మహిళ నటులు లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ ఇప్పటికే పలువురు వెల్లడించే విషయం తెలిసింది. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఆమని తనకు జరిగిన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ ప్రొడ్యూసర్ తనని బట్టలు విప్పి చూపించమని అడిగాడంటూ పలు షాకింగ్ విషయాలను బయట పెట్టింది. ఆ షాకింగ్ విషయాలు ఏంటో ఓ లుక్కెయ్యండి.
సీనియర్ నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలకు భద్రత లేదనీ, మహిళ ఆర్టిస్టులకు ఇప్పటినుండే కాదు.. ఒకప్పటి నుండి ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, సావిత్రి కాలం నుండి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ రోజులలో సోషల్ మీడియా లేదని, అందుకే ఆ విషయాలు బయటకు రాలేదని చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల .. చిన్న చిన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇదిగో పిల్లి అంటే అదిగో పులి అనే రేంజ్ లో విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ, అప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, అందుకే ఆనాడు జరిగిన దారుణాలు బయటికి రాలేదని అన్నారు.

మరి ఇండస్ట్రీలో మీరేమైనా అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కున్నారా? అని ప్రశ్నించగా.. ఆమని స్పందిస్తూ.. కెరీర్ ప్రారంభంలో తాను కూడా ఇలాంటి అనుభవాలను చాలానే ఎదుర్కున్నానని, ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యేవని వివరించారు. అందులో ముఖ్యంగా కొందరు అమ్మాయిలను వాడుకుందామని ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వస్తారని అన్నారు. సాధారణంగా పెద్ద ప్రొడక్షన్ హౌస్లలో ఇలాంటి వేధింపులు ఉండేవి కాదని అన్నారు.
పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి తమకు ఏమైనా ఆఫర్లు వస్తే.. వారు డాన్స్ ఎలా చేస్తారు? డైలాగ్స్ ఎలా చెప్తారు? అనే విషయాలు మాత్రమే అడిగేవారిని, కానీ ఇండస్ట్రీలో అప్పుడే వచ్చి కొత్త ప్రొడక్షన్ అవసరం పేరిట కొంతమంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారని అన్నారు. ఆ విషయం తెలియక వారి దగ్గరికి వెళ్తే, వారు హీరోయిన్గా అవకాశం ఇస్తామని చెబుతూ టూ పీస్ డ్రెస్ వేసుకోవాలని అనేవారు. తీరా ఒప్పుకున్నాక తమ ముందే వేసుకోవాలని ఇబ్బంది పెట్టేవారని అమని సంచలన వ్యాఖ్యలు చేసింది.

గతంలో ఇలానే వేరే వారికి ఆఫర్స్ ఇస్తే.. వారికి మార్క్స్ లాంటివి ఉన్నాయని, మీ కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? అని అడిగేవారు. అంతేకాకుండా ఒకసారి మీరు ఏ బట్టలు విప్పి చూపించాలని, బలవంతం చేసేవారు. అప్పుడే వారి గురించి అర్థమయ్యేది. అలాంటి ఆఫర్స్ ఎన్నిటినో తిరస్కరించాలని, చాలామంది వారి యొక్క అసలు రూపం తెలియక వారి మాయలో పడి జీవితాలను ఆగం చేసుకునే వారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మొత్తానికి ఆమె చేసిన కామెంట్స్ తో ఇండస్ట్రీలో అమ్మాయిలు ఇలాంటి బాధలు ఎదుర్కొన్నారు అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications











