Vishal తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి అభినయ.. లీకైన ఫొటోలపై ఆగ్రహం
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతను ప్రముఖ నటి అభినయతో ప్రేమలో ఉన్నాడు అని త్వరలోనే ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుగు మీడియాలో కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై వెంటనే నటి అభినయ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాగే విశాల్ అభినయకు సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని వైరల్ కావడంతో వాటిపై కూడా ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇదివరకే నిశ్చితార్థం
తమిళంలోనే కాకుండా విశాల్ తెలుగులో కూడా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు అతని ప్రతి సినిమా కూడా తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదలవుతూ ఉంటుంది. ఇక విశాల్ పర్సనల్ లైఫ్ మ్యారేజ్ కు సంబంధించిన వార్తలు చాలాసార్లు వైరల్ అయ్యాయి. గతంలోనే అతను వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నాడు అని కథనాలు వెలుపడ్డాయి. అలాగే ఒక ప్రముఖ నటి తో కూడా నిశ్చితార్థం జరిగింది కానీ ఆ తరువాత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.

మరోసారి పెళ్లి వార్తలు
ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత విశాల్ కు సంబంధించిన పెళ్లి వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అతను ప్రముఖ నటి అభినయతో ప్రేమలో ఉన్నాడు అని ఆమెను పెళ్లి చేసుకోవడానికి వారి కుటుంబాన్ని కూడా ఒప్పించినట్లుగా ఇటీవల తెలుగు మీడియాలో కూడా ఒక రేంజ్ లో కథనాలు వచ్చాయి. ఇలాగే కొన్ని ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

హీరోలకు చెల్లెలి పాత్రల్లో
నటి అభినయశ్రీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆమె మాట్లాడదు అలాగే వినికిడి సమస్య ఉన్నప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపును అందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ వెంకటేష్ సోదరిగా నటించిన విధానం అప్పట్లో అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. అలాగే అంతకుముందు శంభో శివ శంభో సినిమాలో కూడా ఆమె రవితేజ సోదరిగా నటించిన విషయం తెలిసిందే.

విశాల్ తో పెళ్లి అంటూ..
తమిళంలో ఆమె విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఎంతగానో క్రేజ్ అందుకుంది. ఇక తెలుగు తమిళంలో బిజీగా ఉన్న అభినయ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అని ముఖ్యంగా విశాల్ తో ఆమె ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అభినయ అధికారికంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అందులో నిజం లేదని అంటూ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని.. విశాల్ తో మార్క్ ఆంటోనీ అనే సినిమాలో నటిస్తున్న విషయం నిజమే అంటూ.. అందులో విశాల్ కు భార్యగా నటిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కొందరు కావాలని వైరల్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు ప్రచారం చేశారు అని ఇక అందులో ఎలాంటి నిజం లేదు అని అభినయ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











