విశాల్ తో పెళ్ళి.. అసలు విషయం చెప్పిన యంగ్ హీరోయిన్
చిత్ర పరిశ్రమలోనే నటీనటులు కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే చాలు లేనిపోనివి అంటగట్టేస్తుంటారు. వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతుంటాయి. తొలినాళ్లలో దీనిపై నటీనటులు స్పందించినా తర్వాత మాత్రం పక్కనపెట్టేస్తుంటారు. దీనిని అలుసుగా తీసుకుని గాసిప్ రాయుళ్లు రెచ్చిపోతుంటారు. తాజాగా తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు నటి అభినయ. ఈ వివరాల్లోకి వెళితే..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్, మహేశ్‌లకు చెల్లెలిగా నటించారు అందాల అభినయం. కానీ ఆమె మూగ బధిర అమ్మాయి. ఏమీ మాట్లాడలేదు, మనం చెప్పేది కూడా ఆమెకు వినిపించదు. కేవలం సైగలతోనే తాను అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా, నెగిటివ్ రోల్స్‌లోనూ నటించి మెప్పించారు. తన లోపాన్ని పక్కనపెట్టి.. అంకితభావం, కృషి పట్టుదలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేస్తున్నారు. కింగ్, శంభో శివ శంభో, ఢమరుకం, రాజు గారి గది 2, సీతారామం, గామి, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో నటించారు.

అభినయ సినిమాలు చూసిన చాలా మందికి ఆమెకు మాటలు రావు, వినపడదన్న సంగతి తెలియదంటే అతిశయోక్తి కాదు. కానీ నటన ఆమెకు భగవంతుడు ఇచ్చిన వరం. ఆమె సైగలతో తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే అభినయ అసిస్టెంట్ దానికి అర్ధాన్ని వివరిస్తారు. కొద్దిరోజుల క్రితం అభినయ తన తల్లిని కోల్పోయిన సంగతి తెలిసిందే. రిక్షాలో బయటికి వెళ్లిన ఆమె తల్లి అందులోనే కన్నుమూశారు. నీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని.. నువ్వు లేకపోతే జీవితంలో ఇదంతా సాధించే దాన్ని కాదని అభినయ తన తల్లిపై ప్రేమను చాటుకున్నారు.
ఇదిలాఉండగా.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలుమార్లు వార్తలు వచ్చాయి. మార్క్ ఆంటోనీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, అది పెళ్లిదాకా వెళ్లబోతోందని రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. అప్పట్లోనే ఈ రూమర్స్‌కు అభినయ చెక్ పెట్టే ప్రయత్నం చేసినా పుకార్లు మాత్రం ఆగడం లేదు.

తాజాగా తన తండ్రితో కలిసి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభినయ కీలక వ్యాఖ్యలు చేశారు. 14, 15 ఏళ్ల వయసులోనే విశాల్ మూవీని చూశానని.. ఆయనకు తాను పెద్ద అభిమానిని అని అభినయ అన్నారు. విశాల్‌ను చాలా సార్లు కలవాలని అనుకున్నానని.. కానీ మార్క్ ఆంటోనీ మూవీలో ఆయనతో కలిసి నటించానని ఆమె చెప్పారు. అలాంటి మా ఇద్దరికి పెళ్లి జరగబోతోందని రూమర్స్ రావడంతో షాకైనట్లు అభినాయ అన్నారు. విశాల్ చాలా మంచి వ్యక్తని, అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా షూటింగ్ గ్యాప్‌లో మాతో కలిసి భోజనం చేస్తారని ఆమె ప్రశంసించారు. ఓ ఆడియో ఫంక్షన్‌లో విశాల్ గురించి చెప్పేటప్పుడు సిగ్గుపడ్డానని , ఆ క్లిప్‌ని కట్ చేసి వైరల్ చేశారని ఇలాంటివి కరెక్ట్ కాదని అభినయ అన్నారు.


Click it and Unblock the Notifications











