హీరోయిన్ల డ్రెస్సింగ్‌‌పై మోరల్ పోలీసింగా? శివాజీకి పరోక్షంగా అనసూయ చురకలు

బెదురులంక 2012 లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేి రూపొందించిన చిత్రం దండోరా. తెలుగు సినిమా పరిశ్రమలోని పాపులర్ యాక్టర్లు శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

సామాజిక సృహ, కులం వివక్ష లాంటి అంశాలతో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గార‌పు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇప్పటికే మంచి అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 23న అమెరికాలో ప్రీమియర్లతో, డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ అవుతున్నది.

Actress Anasuya Bharadwaj

ఈ నేపథ్యంలో డిసెంబర్ 22వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ.. మహిళల వస్త్రధారణ గురించి అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తూ కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ విషయంపై హీరోయిన్లు, మహిళా నటులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ వివాదానికి కారణమైన శివాజీ స్పీచ్ ఏమిటి? దానిపై నటి అనసూయ భరద్వాజ్ స్పందించిన విధానం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

శివాజీ మాట్లాడుతూ.. మన హీరోయిన్లు వేసుకొనే బట్టలు చూస్తే మనకే దరిద్రమనిపిస్తుంటుంది. హీరోయిన్లు ఏమనుకొన్నా పర్వాలేదు. మీ అందం నిండుగా కట్టుకొనే చీరలో.. నిండుగా కప్పుకొనే దుస్తుల్లోనే ఉంటుంది తప్పితే.. సామాన్లు కనపించే దుస్తుల్లో ఉండదు. మీరు అర్ధనగ్నంగా కనిపించే దుస్తులు వేసుకొన్నప్పుడు చాలా మంది మీ ముందు నవ్వుతారు. కానీ మనసులో దరిద్రపు ముండ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకొంటారు? కొంచెం మంచి బట్టలు వేసుకొంటే బాగుంటుంది కదా అని లోపల అనాలనిపిస్తుంది. ఆ మాటలు బయటకు అనలేం. స్త్రీ అంటే ప్రకృతి.. ఎంత అందంగా ఉంటే.. అంత గౌరవం పెరుగుతుంది. ప్రకృతి మాదిరిగానే మా అమ్మ సావిత్రి, సౌందర్య మాదిరిగా చక్కగా కనిపిస్తుంటుంది. గ్లామర్ ఒక దశ వరకే ఉండాలి. కానీ హద్దు మీరి ఉండకూడదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మనం వేష, భాషల వల్లే గౌరవం, స్వేచ్ఛ లభిస్తుంది. చీరకట్టు మహిళలకే విశ్వసుందరి అవార్డులు లభించాయి అని శివాజీ అన్నారు.

Take a Poll

శివాజీ చేసిన కామెంట్స్‌పై అనసూయ ఘాటుగా స్పందించారు. ఇది నా బాడీ.. మీ శరీరం కాదు అని పోస్టు పెట్టింది. అనంతరం.. మరో పోస్టు పెడుతూ.. మహిళల వస్త్రాలంకరణ ఎలా ఉండాలి అనే విషయంపై ఇటీవల పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌పై చేసిన కామెంట్స్‌కు ఇది నా రిమైండర్. రక్షణ పేరుతో కొందరు తమ జడ్జిమెంట్‌ను ఇస్తూ కన్‌ఫ్యూజ్‌గా కంట్రోల్ చేయాలని చూడటం నాకు ఆశ్చర్యం కలిగించింది అని అనసూయ తన పోస్టులో పేర్కొన్నారు.

దుస్తులు ధరించడమనేది మహిళకు వారి వ్యక్తిగతమైన ఛాయిస్. ఒకరు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. మా దుస్తులు ఎవరికి హానీకరం కాదు. ఎవరైతే కామెంట్స్ చేశారో.. వారిది కామెంటా? లుక్స్ గురించా? ఆయన ఒపీనియనా? అవి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మోరల్ పోలీసింగ్ ద్వారా అభద్రతాభావం పెంచడం పురుషతత్వం అనిపించదు. మహిళలకు రక్షణగా మారదు. అది కేవలం కంట్రోల్ చేయడం మాత్రమే అవుతుంది. సూపరవిజన్ ద్వారా గౌరవం పెరగదు అంటూ శివాజీకి అనసూయ చురకలు అంటించే ప్రయత్నం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X