సానుభూతి కాదు.. న్యాయం కావాలి.. జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై అనసూయ షాకింగ్ కామెంట్స్..
Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న జానీ మాస్టర్ పై తన దగ్గర పనిచేస్తున్న ఓ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు, బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ సహా పలువురు, సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా ఈ కేసుపై నటి అనసూయ భరద్వాజ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం అనసూయ కామెంట్స్ వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన టీంలో ఉన్న లేడీ డాన్సర్ పై అత్యాచారానికి పాల్పడ్డరనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2017లో'ఢీ'షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడనీ, తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్‌కు పిలిపించారని బాధితురాలు పేర్కొంది.

ఈ క్రమంలో అవుట్ డోర్ షూటింగ్ పేరిట చెన్నై,ముంబై,హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. షూటింగ్ సెట్స్ లో క్యారవాన్ లో లైంగిక వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో వివరించింది.ఆమె కూడా తన మీద దాడి చేసినట్లు వెల్లడించింది.
అంతేకాకుండా.. మత మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడనీ, అంగీకరించపోతే.. పలు మార్లు దాడి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తనని వివాహం చేసుకోవాలని, ఒకవేళ వివాహం చేసుకోకపోతే.. ఇండస్ట్రీలో లేకుండా చేశానని భయాభంత్రులకు గురి చేశాడని ఆరోపించింది. జానీ మాస్టర్ భార్య కూడా తనకు సహకరించేదనీ, ఆమె కూడా తనపై దాడి చేసిందని ఎఫ్ఆర్ఐలో వెల్లడించింది. దీంతో జానీ మాస్టర్ పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు.

ఈ విషయంపై నటి అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో ఓ సోర్టీని పోస్టు చేసింది. 'మహిళలకు సానుభూతి అవసరం లేదు. ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధ చాలా దారుణం. చాలా మంది అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందులు తల్తెత్తితే.. వెంటనే ప్రతిస్పందించాలి. బహిరంగంగా చెప్పాలి. సానుభూతి అవసరం లేదు. ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. మీరు గానీ, మీకు తెలిసినవాళ్లు గాని అసౌకర్యమైన, అగౌరవకరమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నా.. వాటిని ప్రతిఘటించాలి. మీకు అందరూ తోడుగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
నటి అనసూయ కంటిన్యూ చేస్తూ.. 'నేను బాధితురాలితో కొన్ని రోజులు పనిచేశాను. 'పుష్ప' సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆ అమ్మాయి తన ప్రతిభ కనబరించిందనడంతో ఎలాంటి సందేహం లేదు. బాధితురాలుకు మద్దతుగా నిలువడానికి, మాట్లాడటానికి ముందుంటాను. ఈ కేసులో అమ్మాయికి న్యాయం అందించాలి. ఆమెకు న్యాయం జరిగేలా నిజాయితీగా పాటుపడుతున్న ఫిల్మ్ ఛాంబర్, వోడబ్ల్యూ సభ్యులకు కూడా నా కృతజ్ఞతలు. మనమందరం కలిసి సాగడానికి, మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురుకాకూడదని, సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని ఆశిస్తున్నాము" అని అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications











