మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో గ్లామర్ క్వీన్ అంజలి!

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్ సినిమాలు ఇటు హారర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఎంటర్టైన్ చేసిన అందాల తార అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు మన అంజలి సరికొత్త సినిమా తో పూర్తీ కామెడీ సినిమా తో మన ముందుకు వస్తుంది. కృష్ణన్ జయరాజ్ దర్శకత్వం లో బెల్లూన్ సినిమా దర్శకుడు కె ఎస్ సినీష్ నిర్మాతగా ది సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకం పై నిర్మించబడుతుంది.

Actress Anjali in another crazy project

ఈ సందర్బంగా నిర్మాత కె ఎస్ సినీష్ మాట్లాడుతూ "మాములుగా మహిళాలు ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు అయితే థ్రిల్లర్ గా లేక హారర్ సినిమాలు గా నిర్మించబడ్డాయి కానీ మా సినిమా పూర్తి ఫాంటసీ కామెడీ. దర్శకుడు కృష్ణన్ జయరాజ్ రచించినా ఈ కథ నాకు చాల బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేదాం అని డిసైడ్ అయ్యాను. అంజలి గారితో నేను బెల్లూన్ సినిమా దర్శకత్వం చేశాను. తాను అయితే ఈ సినిమా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని తనకు కథ ను వివరించాము. అంజలి గారు కూడా కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలో నిర్మించబడుతుంది ".

దర్శకుడు కృష్ణన్ జయరాజ్ మాట్లాడుతూ " అంజలి గారికి ఈ కథ నచ్చితుందో లేదు అని అనుకున్నాం కానీ తనకి కథ చాపగానే చాలా బాగుంది నేను చేస్తున్నాను అని చాపగానే మాకు చాల సంతోషం వేసింది. ఈ సినిమా ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. చాలా కొత్త ఉంటుంది" అని తెలిపారు.

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, కథలో రాజకుమారి, పడి పడి లేచే మనసు సినిమాలకు సంగీతం అందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్వీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

రాజా రాణి, అదిరింది , కర్తవ్యం విశ్వాసం లాంటి బారి బ్లాక్ బస్టర్ సినిమా లో ఎడిటర్ గా పని చేసిన రూబెన్ ఈ సినిమా ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సాహో లాంటి భఆరి బడ్జెట్ చిత్రానికి కొరియోగ్రాఫ్ చేసిన దిలీప్ సుబ్బరామన్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా ఉన్నారు. శక్తీ వెంకటరాజ్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. కథ దర్శకత్వం కృష్ణన్ జయరాజ్ మరియు నిర్మాత కె ఎస్ సినీష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X