సెన్సార్ అధికారులను మెప్పించిన అంజలి.. థియేటర్లలో 3డీ దెయ్యం దడదడే..

అందాల తార అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లీసా 3డీ. లీసా 3డి చిత్రానికి రాజు విశ్వనాథం దర్శకత్వం వహించారు. సంతోష్ దయానిధి సంగీతం అందించారు. మే నెల 24న విడుదల కానున్న ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాను చూసిన సెన్సార్ అధికారుల చిత్ర నిర్మాతలను ప్రశంసలతో ముంచెత్తినట్టు తెలిసింది. సాంకేతిక విలువలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు యూనిట్ వెల్లడించింది.

సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్న నేపథ్యంలో సమర్పకుడు వీరేష్ కాసాని మీడియాతో మాట్లాడారు. దెయ్యాల కథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. హారర్ జోనర్ లో దెయ్యం కాన్సెప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తోంది లీసా. దెయ్యాల్ని లైవ్ 3డిలో చూడబోయే త్రీడీ చిత్రం సెన్సార్ పూర్తి ఇది రెగ్యులర్ దెయ్యం కాదు.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే 3డి దెయ్యం ఇది. థియేటర్లలో దడదడ లాడిస్తుంది. ప్రేక్షకుడికి గజగజ వణికించే చిత్రం. ది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. సౌండ్ ఎఫెక్ట్స్ .. అందుకు తోడు 3డి విజువల్స్ ఆద్యంతం థియేటర్లలో ఆడియెన్ ని గగుర్పాటుకు గురి చేయడం ఖాయం. అని వీరేష్ కాసాని అన్నారు. లీసా 3డి రెగ్యులర్ సినిమా అని భావిస్తే పప్పులో కాలేసినట్టేనని, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. పక్కా కాన్ఫిడెన్స్ అని అన్నారు.

Actress Anjali LISA movie censor completed, Set to release on 24th

లీసా సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, 24 న థియేటర్లలోకి వస్తోందని నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు. ఇండస్ట్రీ బెస్ట్ హారర్ చిత్రం చూడబోతున్నాం. ఈ సినిమా రాకపై ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నాం. ఈ సినిమా ఎంపికకు కారణం ఎక్స్ క్లూజివ్ స్టైల్.. గత చిత్రాల్ని మించి వినూత్నమైన అనుభూతిని అందించే చిత్రం అవుతుందన్న నమ్మకంగా ఉన్నాం. ముఖ్యంగా 3డి విజువల్స్ ఫెంటాస్టిక్ అని ప్రశంసలు కురవడం ఖాయం. కథాంశం సింపుల్ గా కనిపించినా ఆద్యంతం గ్రిప్పింగ్నేరేషన్ తో రక్తి కట్టిస్తుంది అని అన్నారు.

Actress Anjali LISA movie censor completed, Set to release on 24th

అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళితే.. అక్కడ దెయ్యం అనుభూతుల గురించి కథలు కథలుగా చెబుతుంటే మనం విని ఎంతో ఎగ్జయిట్ అయ్యేవాళ్లం. ఈ సినిమా చూశాక అంతకుమించి ఎగ్జయిట్ అవుతారు. తిరిగి చిన్నప్పటి ఆత్మల కథలు.. దెయ్యం కథలు గుర్తుకొస్తాయి అని సురేష్ కొండేటి తెలిపారు.

సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి'
ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,
కోరియోగ్రఫీ: సురేష్,
ఆర్ట్ డైరెక్టర్: వినోద్,
నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రహాస్ ఇప్పలపల్లి,
సమర్పణ కాసాని వీరేశ్
నిర్మాత సురేష్ కొండేటి,
కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X