అంజలి, బ్రహ్మానందంకు ఎలా కుదిరిందబ్బా.. 3Dలో అదరగొట్టనున్న లీసా
విలక్షణమైన నటిగా ప్రూవ్ చేసుకున్న యువ హీరోయిన్ అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె నటించిన "లీసా' చిత్రం అత్యాధునిక సాంకేతికతో 3Dలో రూపొందింది. వీరేష్ కాసాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కె. పిక్చర్స్ ద్వారా నిర్మాత సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ తమ అనుభవాలు పంచుకున్నారు. ముందుగా చిత్ర సమర్పకులు కాసాని వీరేశ్ మాట్లాడుతూ అంజలి ఇంతకు ముందు ఎన్నో మంచి చిత్రాలు చేయడం జరిగింది. గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా లీసా సినిమా ఉంటుంది'' అన్నారు.
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ... మొదటి సారిగా 3డి చిత్రంలో నటిస్తున్నాను. దర్శకుడు రాజు కు స్క్రిప్ట్ పై మంచి క్లారిటీ ఉంది.. ఏదైతే చెప్పాడో అదే తీసాడు. ఇలాంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. ముత్తయ్య తన కెమెరాతో మరింత అందంగా నన్ను చూపించడమే కాకుండా ఖర్చుకు ఎక్కడా వెనకాడ కుండా తీశారు. సంతోష్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తాయి" అన్నారు.

చిత్ర నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ ''గతంలో అంజలితో షాపింగ్ మాల్, జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎస్కె పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది ఆ సినిమాలను ఎంతో అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులు అలాగే లీసా 3D సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకొంటున్నాను. త్రీడీలో ఈ సినిమాని సమ్మర్ కానుకగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పూర్తి వినోదాత్మకంగా అందించడం కోసం మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.
"లీసా' త్రీడీ చిత్ర దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ...100 రోజులు పైగా ఈ షూటింగ్ జరిగింది. షూటింగ్ సెట్ లో ఎన్నో మంచి అనుభూతులు పొందాను.ఒక సినిమా షూటింగ్ చెయ్యడం అంటే కష్టమైన పని అని చెప్పాల్సిన అవసరం లేదు. అది 3D లో అయితే ఇంకా కష్టమైన పని . కానీ పి.జి.ముత్తయ్య గారి ఫ్రేమ్స్ మరియు ఆయన కష్టం వల్ల శరవేగంగా పూర్తయ్యింది.

అంజలి, సామ్ జోన్స్, మకరంద్ దేశ్ పాండే నటన హైలెట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో
బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. నటి సలీమా రెండు దశాబ్దాల క్రితం తెలుగు, కన్నడలో హీరోయిన్‌గా చేసింది. ఆమె ఈ చిత్రంలో నటించినందుకు నా థ్యాంక్స్. మైమ్ గోపి, సబితా రాయ్, సురేఖ వాణి, కళ్యాణి నటరాజన్ కీలక పాత్రల్లో నటించారు. జబర్దస్త్ ఫణి, అవినాష్. జి ఎం ఆర్ కామెడీ పాత్రల్లో నటించారు. ఇందులో అంజలి గారి నటన అద్భుతం అని చెప్పాలి. కెమెరా వర్క్ చాలా బాగొచ్చింది. స్క్రిప్ట్ చాలా బాగుంది. డైరెక్టర్ రాజు అందరికీ నచ్చేలా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరికీ మా లీసా చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అతి త్వరలో ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి సినిమాను కూడా ఈ నెల 24న విడుదల చేస్తామని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ దయానిధి మాట్లాడుతూ... ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం కలిపించినందుకు దర్శకనిర్మాతలకు నా కృతజ్ఞతలు. అద్భుతమైన ఆర్ఆర్‌తో పాటు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి అని ఖచ్చితంగా చెప్పగలను అన్నారు.
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న
ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి'
ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,
స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,
కోరియోగ్రఫీ: సురేష్,
ఆర్ట్ డైరెక్టర్: వినోద్,
ఈ చిత్రానికి నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రహాస్ ఇప్పలపల్లి, సమర్పణ కాసాని వీరేశ్ , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్.


Click it and Unblock the Notifications











