సినీ నటి అంజలికి కరోనా పాజిటివ్.. వకీల్ సాబ్‌ను వెంటాడుతున్న కోవిడ్19
టాలీవుడ్ ప్రముఖులను కరోనావైరస్ వెంటాడుతున్నది. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, విజయేంద్రప్రసాద్, నివేదా థామస్ ఈ వైరస్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో సినీ నటి అంజలి కూడా చేరారు. గత కొద్దికాలంగా వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు. వారానికిపైగా శాటిలైట్, ప్రింట్, వెబ్, యూట్యూబ్ ఛానెల్స్‌కు నిరంతరంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ప్రధానంగా దర్శకుడు శ్రీరాం వేణు, నివేదా థామస్, అనన్య నాగళ్లతో కలిసి అంజలి ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో నివేదా థామస్ కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత రెండు రోజులకే అంజలి కూడా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అంజలికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది.

అయితే అంజలి ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అయితే అంజలి తనకు కరోనావైరస్ అనే విషయాన్ని బయటకు చెప్పకపోవడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
అలాగే వకీల్ సాబ్ ప్రమోషన్‌లో మరికొందరు కూడా కరోనావైరస్ బారిన పడినట్టు సమాచారం.ఇదిలా ఉండగా, వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్‌కు రెడీ అయింది. అంజలితోపాటు నివేదా థామస్, అనన్య నాగళ్ల చిత్రంలో కీలకపాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











