Apsara Rani హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో ఆర్జీవి హీరోయిన్.. హాట్ హాట్ అందాలే కాకుండా అలాంటి కోణంలో!

4 లెటర్స్, ఉల్లాల ఊల్లాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అప్సర రాణి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. హీరోయిన్‌గా రాణిస్తూనే.. స్పెషల్, ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అందాల ఆరబోతతో హాట్ హాట్‌గా కనిపించారు. ఇలా సినిమా జర్నీని కొనసాగిస్తున్న అప్సర రాణి.. గ్లామర్‌కు, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తలకొన సినిమాలో ఇప్పటి వరకు పోషించిన విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సినిమా గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ముహుర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్ పాల్గొన్నారు.

 Actress Apsara Ranis Talakona movie on sets with Big Bang

హీరోయిన్ అపర్ణ రాణి మాట్లాడుతూ.. అన్ని రకాల పాత్రలను పోషించేందుకు ప్లాన్ చేసుకొన్నాను. మంచి స్క్రిప్టుకు నేను ఫ్యాన్‌ను. గ్లామర్ పాత్రలనే కాకుండా మంచి కథలను ఎంచుకొనేందుకే ప్రయత్నిస్తున్నాను. అలాంటి కోవలో నా ముందుకు వచ్చిన చిత్రం తలకొన. దర్శకుడు చెప్పిన కథ నచ్చడం వల్లనే ఈ సినిమాను చేయడానికి ముందుకు వచ్చాను. హీరోయిన్‌గా నాకు మంచి పేరు తెస్తుందని నేను భావిస్తున్నాను అని అపర్ణ రాణి అన్నారు.

 Actress Apsara Ranis Talakona movie on sets with Big Bang

దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ... తలకోన చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే కథాంశం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉంటుంది. పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాం అని తెలిపారు.

 Actress Apsara Ranis Talakona movie on sets with Big Bang

నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... మొదటిసారి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. మంచి స్టోరీ. తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అని అన్నారు.

నటీనటులు: అప్సర రాణి, అశోక్ కుమార్, అజయ్ ఘోష్, సుభాష్, రాజా రాయ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి
నిర్మాతలు: విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బాసింశెట్టి వీరబాబు, జాన్ శామ్యూల్
నిర్వహణ: పరిటాల వీర గౌతమ్ రాంబాబు
డివోపి: మల్లికార్జున్
మ్యూజిక్: సుభాష్ ఆనంద్,
ఫైట్స్: విన్ చిన్ అంజి
పీఆర్వో: వీరబాబు.బి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X