twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను బతికే ఉన్నా.. విమాన ప్రమాదంలో చనిపోలేదు.. టెలివిజన్ నటి

    |

    పాకిస్థాన్‌లో విమాన ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. లాహోరు నుంచి బయలు దేరిన విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో జన ఆవాసాల మీద కూలిపోయింది. దాదాపు 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి.

    విమాన ప్రమాద ఘటనలో పాకిస్థానీ నటి ఆయేషా ఖాన్, ఆమె భర్త డానిష్ తైమూర్ మరణించారంటూ వదంతులు విస్తృతంగా ప్రచారమయ్యాయి. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై స్పందిస్తూ ఆమె ఇన్స్‌గ్రామ్‌లో స్పందించారు.

    Actress Ayeza Khan condemns her death in Pak plane crash.

    నేను నా భర్త విమాన ప్రమాదంలో మరణించామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. వాటిని నమ్మకండి. అలాంటి వార్తలను ప్రచారం చేసే వారిని అల్లా చూసుకొంటారు అని ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌ పేజ్‌లో తెలిపారు. ఇలాంటి వార్తలను పోస్టు చేసేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి. ఇతరుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించకూడదు అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

    అయితే తన మరణంపై వస్తున్న రూమర్లపై ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టును డిలీట్ చేశారు. ఆ తర్వాత అదే పోస్టును న్యూగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆయేషా ఖాన్ పాకిస్థాన్ టెలివిజన్‌లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన నటి, యాంకర్. ఆమె అదూరి ఔరత్, కోయి చాంద్ రఖ్, తుమ్ కౌన్ పియా లాంటి సిరియల్స్ నటించారు.

    English summary
    Pakistan Television Actress Ayeza Khan condemns her death in Pak plane crash. She said, Whatever comes in social media are fake. Dont believe news on my death in Plane accident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X