Divi Vadthya: పుష్ప2 ఆలస్యానికి కారణం సుక్కుయే.. ఒక్కో సీన్‌కు అన్ని టేక్స్ తీసుకుంటూ!

బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ.. తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈమె అలా వచ్చిన గుర్తింపుతోనే బిగ్ బాస్ కు వెళ్లింది. ఆ తర్వాత నుంచి మరింత ఫాలోయింగ్ పెంచుకుని.. సినిమాలు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తుండగా... ఆ చిత్రం ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పింది. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ వల్లే సినిమా షూటింగ్ లేట్ గా అవుతుందని వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పొడుగుల కాళ్ల సుందరి అయిన దివి వాద్త్యాకు సినిమాలు చేస్తూ మంచి గుర్తింపే తెచ్చుకుంది. బిగ్ బాస్ కువెళ్లి వచ్చినప్పటి నుంచి అయితే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా లంబసింగి సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ... పుష్ప2 సినిమాలో కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి తాజాగా దివి షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా సినిమా ఆలస్యానికి కారణం ఏంటో కూడా చెప్పుకొచ్చింది.

Actress Divi Vadthya Reveal Why Pushpa 2 Movie Shooting is Late Check Details

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి వాద్త్యా తన సినిమా అప్ డేట్ల గురించి చెప్పింది. ఈక్రమంలోనే పుష్ప2 షూటింగ్ గురించి కూడా చాలానే విషయాలు చెప్పుకొచ్చింది. తాను పుష్ప2 సినిమాలో రిపోర్టర్ గా కనిపించబోతున్నట్లు తెలిపిన ఈమె... రిపోర్టర్ గా చేయడానికి అంత కష్టపడాలనే విషయం ఈ సినిమా షూటింగ్ లోనే తెలిసిందని వివరించింది. నిజమైన రిపోర్టర్ లతో పాటు నటులను కూడా పెట్టి తీస్తున్న ఆ సీన్ లో అందరూ తోసుకుంటూ వెళ్లగా తాను కింద పడిపోయానని.. చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది.

అలాగే డైరెక్టర్ సుకుమార్ కు పర్ఫెక్షన్ కావాలని.. ఒక సీన్ ను తాను ఎలాగైతే చేయాలనుకుంటారో అలాగే చేసేందుకు ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారని వివరించింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా షూటింగ్ లో భాగంగా ఒక్కో సీన్ కోసం ఆయన మినిమమ్ 5 టేక్స్.. మాక్సిమమ్ 35 ప్లస్ టేక్స్ తీసుకుంటున్నారని వెల్లడిచింది. పక్కనుంచి ఒకరు రావాలి, అప్పుడే ఆ యాక్టర్ అలా చెప్పాలి అంటే అలాగే జరగాలని.. కరెక్టుగా రాకపోతే... ఎంత ఆలస్యమైనా సరే టేక్స్ తీసుకుంటూనే ఉంటారని వివరించింది.

Actress Divi Vadthya Reveal Why Pushpa 2 Movie Shooting is Late Check Details

ముఖ్యంగా అల్లు అర్జున్ తో ఓ సీన్ కోసం 40 టేక్స్ వరకు తీసుకున్నారని.. ఆ ఒక్క సీన్ కోసమే దాదాపు రెండు మూడు గంటలు బన్నీ ఎండలో నిల్చోవాల్సి వచ్చిందని దివి వాద్త్యా వివరించింది. సుకుమార్ తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయాలనుకోవడం వల్లే.. ఇంత ఆలస్యం అవుతుందని.. ఎక్కుడా వెనక్కి తగ్గకుండా చేస్తున్నారు కాబట్టే ఈ సమస్య వస్తుందంటూ వివరించింది. కానీ పుష్ప 2 సినిమా మాత్రం అందరి అంచనాలను అందుకుంటుందని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X