‘బాయ్‌ఫ్రెండ్ లేని టైంలో రూమ్‌లోకి.. ఆ నిర్మాత నా డ్రెస్ లాగేసి, గంటపాటు’
గాయత్రీ గుప్తా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీటూ ఉద్యమం సమయంలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో చిత్ర పరిశ్రమను షేక్ చేసింది. సినిమాలపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలు, విభేదాలతోనే గాయత్రీ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తనకు ఆరోగ్యం బాలేదని చికిత్స కోసం దాతలు సాయం చేయాలని కోరి షాకిచ్చింది. తాజాగా చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూల ఇచ్చిన గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రతి చోటా కమిట్‌మెంట్ అడిగారు
'ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి ఎన్ని రేప్ అటాక్స్ అయ్యాయో అనేదానికి ప్రూఫ్స్ లేవు. అమాయకంగా, ఏం తెలియకుండా తిరిగా. కాలేజీలో మా సీనియర్లు హాలీవుడ్ వాళ్ల వీడియోలు చూపించడంతో బాగా భయపడిపోయా.. తెలుగు వాళ్లు మంచోళ్లు కాబట్టి ఏమైనా పీకితే ఇక్కడే పీకాలని డిసైడ్ అయ్యా. ఆడిషన్స్ స్టార్ట్ చేస్తే వెళ్లిన ప్రతి చోటా కమిట్‌మెంట్ అడగటం, రేప్ అటాక్స్ చేయడం చాలా జరిగాయి. ఈరోజుకు నా కెరీర్ బాలేదు.. ట్రీట్‌మెంట్ కోసం క్రౌడ్ ఫండింగ్ చేసుకోవాల్సిన పరిస్ధితి' అని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

నిజాలు మాట్లాడినందుకు బెదిరింపులు
' ధైర్యంగా నిజాలు మాట్లాడినందుకు చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి.. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా, ఆరోగ్యం దెబ్బతింది, ప్రాజెక్ట్ రావట్లేదు. నన్ను ఇండస్ట్రీ కట్ చేసినా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఇండిపెండెంట్‌గా సినిమాలు తీసేవాళ్లు నాకు అవకాశాలు ఇస్తున్నారు. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి.. కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికీ లేదు. వేరే ఛానెల్స్‌కు వెళితే.. నా పేరు, ఇమేజ్ నాశనం చేస్తున్నారు. అందుకే నా యూట్యూబ్ ఛానెల్‌లో నేనే కంటెంట్ పోస్ట్ చేసుకుంటున్నా' అని గాయత్రి గుప్తా తెలిపారు.
బలవంతంగా మందు తాగించారు
'ఒక నిర్మాతకి నేను నచ్చి నా స్టోరీకి ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యాడు. మేనేజర్‌ని సెట్ చేసేశాడు, టీమ్‌ని సెట్ చేసేశాడు. చివరికి నా వల్ల కావట్లేదని దండం పెట్టేశాడు. నా పేద బతుకు నేను బతికేస్తానని వచ్చేశా. కానీ ఒక సినిమా సగం పూర్తయ్యాక వేధింపులు భరించలేకపోయా, జాగ్రత్తగా ఉంటూ ఫ్రెండ్‌ని తోడుగా ఉంచుకునే దానిని. ప్రొడ్యూసర్, డైరెక్టర్ నాపై అత్యాచారయత్నం చేశారు.. వాళ్లిప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు. ట్రైలర్ హిట్ అయ్యిందని పార్టీకి పిలిచి.. పార్టీలో నో చెప్పడం రాక బలవంతంగా మందు తాగిస్తే తాగేశా. నాకు మందు పడదు, మందు తాగితే పెయిన్ వచ్చేస్తుంది, అందుకే మందు ఇష్టం ఉండదు' అని గాయత్రి తెలిపింది.
ఏడుస్తూ మూలన కూర్చొన్నా
'మొహమాటం కొద్ది తాగుతుండగా ఒక్కసారిగా లోపలికి పోసేయడంతో ఔట్ అయిపోయా. అప్పటికే నా బాయ్‌ఫ్రెండ్‌ని సేఫ్టీగా తీసుకుని వెళ్లా. అయితే మా ఫ్రెండ్‌కి ఊరు నుంచి ఫోన్ రావడంతో ఎమర్జెన్సీ అయితే నాకు ఫోన్ చేయమని చెప్పి బయటికి వెళ్లాడు. నేనొక్క దానినే ఉన్నానని డిసైడ్ అయిన డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లు కారులో డ్రాప్ చేస్తామని చెప్పారు. నా కారు రిపేర్ ఉంది, ప్రొడ్యూసర్ గారు డ్రాప్ చేస్తారని డైరెక్టర్ జారుకున్నాడు. ఆ ప్రొడ్యూసర్.. ఫోన్ తీసుకుని నాటకాలాడుతూ.. డ్రైవర్ రావడానికి టైం పడుతుందని నన్ను పైకి తీసుకెళ్లాడు. వెంటనే ఆ నిర్మాత నా డ్రెస్ లాగడానికి ట్రై చేశాడు.. నన్ను ఆరోజు ఆ డ్రెస్సే కాపాడింది, కొంచెం లూజుగా ఉండటంతో మా డిజైనర్ కుట్లు వేసేసింది. డ్రెస్ పట్టుకుని మూలన కూర్చొన్నా.. ఒక గంటపాటు బలవంతం చేశాడు. ఇక వల్ల కావడం లేదని డైరెక్టర్‌కి ఫోన్ చేసి ఇంటి దగ్గర దించేసి వెళ్లిపోయారు' అని గాయత్రి గుప్తా తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











