గాయత్రీ గుప్తా ఆరోగ్యం విషమంగా.. ఆర్థిక సాయం కోసం దాతల కోసం ఎదురుచూపులు!
గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీని షేక్ చేసి.. రచ్చ రేపింది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి.. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి చిత్రాల్లో నటించిన గాయత్రి గుప్తా నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక సినిమాల్లో వచ్చిన పేరు కన్నా.. వివాదాల్లో అమ్మడు సంపాదించుకున్న పేరే ఎక్కువ. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్ బాస్ వివాదంలో తనను లైంగికంగా వేధించారని మీడియాకెక్కిన గాయత్రి గుప్తా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూలో మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది.

ఇక ఆ వివాదం ద్వారా ఆమెను చాలామంది విమర్శించారు. అస్సలు అమ్మడి జీవితమే ఒక పెద్ద సమస్య. పేరెంట్స్ లేరు.. ఫ్యామిలీ లేదు.. ప్రేమించినవాడు మోసం చేయడంతో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఇక గతేడాది తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. చికిత్స కోసం డబ్బులు హెల్ప్ చేయాలని కూడా కోరింది.
" గత కొంత కాలంగా నేను ఆటో ఇమ్యూనిటీ సమస్యతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. గత ఏడాదిన్నర కాలంగా చికిత్స తీసుకుంటున్నాను. నెలకు ఒకటి రెండు ఇంజెక్షన్స్ తీసుకుంటాను. అవి లేకపోతే యాక్టివ్ గా ఉంటాను" అని చెప్పింది.
ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గాయత్రీ గుప్తా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఎప్పటిలానే ఈ ఇంటర్వ్యూ లో మరోసారి కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. " నేను ఇప్పటికి చెప్తున్నా.. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉంది. నేను అప్పుడు చెప్తే ఎవరు నమ్మలేదు. నా తరువాత చాలామంది పోరాటం చేశారు. చాలా మంది హీరోయిన్లు ఇష్టంతో సెక్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం అవసరాల కోసం అలాంటి వాటికి ఒప్పుకుంటున్నారు, వాళ్లలో ఎక్కువ మంది అమాయకపు అమ్మాయిలే ఉన్నారు. వాళ్ల గురించి ఎవరు మాట్లాడరు" అంటూ తెలిపింది.

అంతేకాకుండా ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా లేదని, ఇప్పటివరకు చాలా వరకు ఖర్చు అయ్యిందని, ట్రీట్ మెంట్ కోసం మొత్తం రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని, కానీ ఇప్పటివరకు లక్ష రూపాయలు కూడా అందలేదని తెలిపింది. తన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందని, గొప్ప మనసు కలిగిన దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయమని కోరింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి గాయత్రీ గుప్తాను ఇండస్ట్రీలోని పెద్దలు ఆదుకొంటారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











