డేటింగ్ యాప్‌లో సినీ నటి మార్ఫింగ్ ఫోటోలు.. పోలీసులకు టాలీవుడ్ హీరోయిన్ ఫిర్యాదు!
వర్థమాన తార గీతాంజలికి చేదు అనుభవం ఎదురైంది. తన ఫోటోలను కొందరు తుంటరి యువకులు మార్పింగ్ చేసి డేటింగ్ యాప్‌లో పెట్డడంతో ఆమె షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా తనను వేధిస్తున్న యువకులపై గీతాంజలి నారాయణగూడ పోలీసులతోపాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలను సినీ తారలకు ఎదురవుతున్నాయి. పలువురు ఇప్పటికే పలు సందర్భాల్లో ఇలాంటి ఫిర్యాదు చేశారు. అలాంటి సంఘటనల బారిన పడిన గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులకు అందించిన ఫిర్యాదు పత్రంలో.. నా ఫోటోలను నా ప్రమేయం లేకుండా ఉపయోగించారు. పలు డేటింగ్ యాప్‌లలో అప్‌లోడ్ చేశారు. దాంతో నాకు గుర్తు తెలియని వ్యక్తులు నా ఫోన్‌కు కాల్ చేస్తూ వేధిస్తున్నారు. ఆ వేధింపులు భరించలేకపోతున్నాను. ఇలాంటి పనికి పాల్పడిన వ్యక్తులను కఠిన శిక్షించాలి అంటూ గీతాంజలి పేర్కొన్నారు.
నటి గీతాంజలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు డేటింగ్ యాప్‌లో ఫోటోలను పోస్టు చేసింది ఎవరనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి ఉపశమనం కలిగించేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకొంటామని పేర్కొన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











