నటి గీతాంజలి కుమారుడు, సినిమా బండి ఫేమ్ వికాస్ హీరోలుగా.. అంతేలే కథ అంతేలే

బిగ్‌బాస్ తెలుగు ఫేమ్, హీరో తనీష్, సినిమా బండి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న వికాస్ వశిష్ట కలిసి నటిస్తున్న చిత్రం అంతేలే కథ అంతేలే. విభిన్నమైన చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల పట్టం కడుతున్న ఈ రోజుల్లో విలక్షణ కథ, కథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అనంతపురం బ్యాక్ డ్రాప్‌లో ఎమోషన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం అంతేలే కథ అంతేలే. రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ , వికాస్ వశిష్ట, సహర్ కృష్ణన్ , శ్రీనివాస్ నటీనటులుగా దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం ఇది. సెప్టెంబర్ మాసంలో షూటింగ్ ప్రారంభం కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

Anthele Katha Anthele

చిత్ర దర్శకుడు ఎం నివాస్ మాట్లాడుతూ.. నా డైరెక్షన్‌లో అంతేలే కథ అంతేలే సినిమా నిర్మిస్తున్నాం. సినిమాబండి చిత్రంతో అందరినీ మెప్పించిన నటుడు వికాస్ వశిష్ట ఇంకా తనీష్ హీరోలుగా, సెహర్ కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే నెల షూటింగ్ వెళుతున్నాం. ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ, అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి. ఈ చిత్రాన్ని అనంతరం, నల్గొండ, హైదరాబాద్ లల్లో మూడు షెడ్యూల్ లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

Anthele Katha Anthele

హీరో తనీష్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన పాత్ర ఇది.ఇందులో సంబంధాలు చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గుండెలు బరువెక్కుతాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని అన్నారు.

హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ .. సినిమా బండి తర్వాత చేస్తున్న ఈ సినిమా. ఈ సినిమా టైటిల్‌లోనే కథ ఉంది. ఇందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఎక్కువ మాటలు ఉండవు కానీ ఎమోషన్ కథను ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమాను కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు.

హీరోయిన్ సహార్ కృష్ణన్ మాట్లాడుతూ..నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నా కిచ్చిన పాత్రను 100% ప్రేక్షకులను మెప్పించేలా పోసిస్తాను అన్నారు .

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ .. సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది అన్నారు.

నటీనటులు: తనీష్, వికాస్ వశిష్ట (సినిమాబండి హీరో), సహర్ కృష్ణన్ (హీరోయిన్), శ్రీనివాస్ తదితరులు
బ్యానర్:- రిధిమ క్రియేషన్స్,
నిర్మాణం: శ్రీ ఎమ్ నివాస్ ప్రొడక్షన్,
దర్శకుడు, నిర్మాత: శ్రీ ఎమ్ నివాస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X