Rave party: డ్రగ్స్ కేసుపై హేమ షాకింగ్ కామెంట్స్.. తిరుమలలో మీడియాపై అసహనం!

బెంగళూరులో రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలుగు నటి హేమ అడ్డంగా బుక్ కావడం అందర్నీ షాక్ గురిచేసింది. ఈ కేసులో వైద్య పరీక్షల అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించడం.. అనంతరం ఆమె బెయిల్‌పై రిలీజ్ కావడం తెలిసిందే. అయితే తాజాగా ఆమె తిరుమలను సందర్శించి.. శ్రీవారిని దర్శించుకొన్నారు. ఆ తర్వాత మీడియాపై అసహనం ప్రదర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే..

బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులు రిమాండ్ తరలించే సమయంలో హేమ సంచలన ఆరోపణలు చేసింది. తనను ఈ కేసులో బలి చేశారు. ఇప్పటి వరకు నాకు వైద్య పరీక్షలు నిర్వహించలేదు. కస్డడీలోకి తీసుకొన్న తర్వాతే నాకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదు. నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారు. నాతో దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.

Actress Hema Interesting Comments on Rave Party and Drug Case at Tirumala

ఇక బెయిల్‌పై ఉండి విచారణను ఎదుర్కొంటున్న హేమ జూన్ 29వ తేదీన శ్రీవారిని దర్శించుకొన్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె తన అభిమానులు, సందర్శకులతో హుషారుగా మాట్లాడుతూ కనిపించారు. భక్తులతో సెల్ఫీలు దిగుతూ.. వారి పిల్లలను ముద్దు చేస్తూ కనిపించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దర్శనం చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇది నాకు పుట్టినిల్లు లాంటింది. నాకు ఇష్టమైన దేవుడు. బ్రహ్మండంగా దర్శనం జరిగింది అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇక రేవ్ పార్టీ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు కొంత అసహనం ప్రదర్శించారు. డ్రగ్స్ కేసు గురించి మీకే తెలుసు. మీరే ఎక్కువగా రాస్తుంటారుగా.. నన్ను ఎందుకు అడగడం అంటూ ఘాటుగా జవాబిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎప్పటిలానే హేమ ముక్కుసూటిగా మాట్లాడటం కనిపించింది.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో హేమ ఆరోపించినట్టు ఆమెను కావాలనే ఇరికించారా? 100 మంది ఉంటే ఆమెనే ఎందుకు అరెస్ట్ చేశారు? అనే ప్రశ్నలు అనుమానాలు రేకెత్తించాయి. అయితే ఈ కేసులో హేమకు శిక్ష పడుతుందా? లేదా నిర్దోషిగా బయటకు వస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: hema tirumala rave party
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X