Actress Hema: నటి హేమ ఐస్ బాత్..మంచు గడ్డల మధ్య వణికిపోయిందిగా,అలా ఎంత సేపు?
వివాదాస్పద వ్యాఖ్యలు, చేతలతో నిత్యం వార్తల్లో ఉంటారు టాలీవుడ్ నటి హేమ. మొన్నామధ్య బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో హేమ పేరు తెరపైకి రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న హేమ తిరిగి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హేమ ఏం చేసింది? అంతలా ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతోంది చూస్తే
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భలే దొంగ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన హేమ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తొలినాళ్లలో హీరోయిన్ల ఫ్రెండ్‌గా కనిపించిన ఆమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైంది. నటుడు మీర్ తమ్ముడు జాన్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన హేమ.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

దాదాపు ఆరు అడుగుల హైట్‌తో, గోదావరి యాసతో , తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంకి భార్యగా అద్భుతంగా నటించింది. అమ్మ, అక్క, వదిన, పిన్ని పాత్రలతో బాగా బిజీ అయ్యింది. అయితే ఒకప్పటి సీనియర్ హీరోయిన్లంతా సెకండ్ ఇన్నింగ్స్‌లు స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడంతో హేమ, సుధ లాంటి వారికి అవకాశాలు తగ్గిపోయాయి. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం హేమ స్టైల్. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం తనకు లేదని ఆమె పలుమార్లు చెప్పింది.
మా అసోసియేషన్‌లో కీలకపాత్ర పోషించే హేమ.. పలుమార్లు తన దూకుడుతో వివాదాలు తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో ఓ నటుడి చేతిని ఆమె లైవ్‌లోనే కొరకడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియా సమావేశాల్లోనూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు హేమ. రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ఆమె మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి మండపేట నుంచి పోటీ చేసి దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు హేమ.
ఇక ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ఆమెను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టడంతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ ఇష్యూ తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్న హేమ ఇటీవల సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. తాజాగా ఆమె ఐస్ బాత్ చేసి దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్పిరిట్యువల్ సైకాలజిస్ట్ సోనాక్షీ భూటానీ వద్ద ఐస్ బాతింగ్‌పై శిక్షణ తీసుకున్న హేమ ప్రాక్టీస్ చేశారు. తొలుత ఐస్ ముక్కలతో నిండిఉన్న టబ్‌లో దిగి వణికిపోయిన ఆమె .. తర్వాత ఎక్కువ సమయం టబ్‌లో గడిపేలా రాటుదేలారు. ఆమె షేర్ చేసిన ఫోటోలోని స్టాప్ వాచ్‌లో సమయం 8 నిమిషాలు చూపిస్తోంది. అంటే దాదాపు అంతసేపు హేమ ఐస్ బాత్ చేశారన్న మాట.
చర్మానికి , మానసిక ఆరోగ్యానికి ఐస్ బాత్ చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. దాదాపు 11 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఐస్ ముక్కలతో ఉన్న టబ్‌లో 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్‌లో ఉన్న చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు త్వరగా రికవరీ అవుతాయట. అలాగే ప్రమాదాల వల్ల జరిగిన గాయాలను వేగంగా తగ్గిస్తుందట. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఐస్ బాత్ ఎంతో మేలు చేస్తుంది. నిరాశ, నిస్పృహలను దూరం చేస్తుందని, అందం కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











