పవన్‌ది మా కులం.. రేవంత్ రెడ్డిని కలుస్తా..రేవ్ పార్టీతో లైఫ్ నాశనం: హేమ సంచలన వ్యాఖ్యలు

కొద్దినెలల క్రితం బెంగళూరులో వెలుగుచూసిన రేవ్ పార్టీ ఘటన ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపింది. నాటి ఘటనలో అరెస్ట్ అయిన వారిలో తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా వార్తలు రావడం సంచలనం సృష్టించింది. అన్నింటికి మించి నటి హేమ ఓవరాక్షన్ హాట్ టాపిగ్‌గా మారింది. రేవ్ పార్టీలో ఆమె పేరు ఉన్నట్లుగా మీడియాలో బ్రేకింగ్స్ రాగా.. వెంటనే రియాక్ట్ అయిన హేమ కట్టుకథలు అల్లింది. తాను హైదరాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ కాసేపటికీ బెంగళూరు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉన్నారని స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.

దీంతో తన డ్రామాలను పక్కనబెట్టి సైలెంట్ అయ్యింది హేమ. ఈ ఎపిసోడ్‌తో హేమపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ పరువు తీసిందంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం ఆమెకు అండగా నిలిచారు. దోషిగా తేలేవరకు ఆమె నిర్దోషేనని.. ఆమెపై అనవసరంగా దుష్ప్రచారం చేయొద్దని మీడియాను విష్ణు కోరాడు. ఖచ్చితమైన ఆధారాలను అందజేస్తే అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందని విష్ణు స్పష్టం చేశారు.

actress hema made sensational comments on janasena chief pawan kalyan victory in ap assembly elections 2024

తర్వాత పోలీసుల విచారణకు కూడా సహకరించలేదు హేమ. తమ ఎదుట హాజరవ్వాలని రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హేమ స్పందించకపోవడంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి మరి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమను అనేకల్‌లోని నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్ట్ ఆమెకు కస్టడీ విధించగా ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు పంపించారు. కొద్దిరోజుల తర్వాత హేమ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగళూరు రేవ్ పార్టీ , తన అరెస్ట్ తదితర విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు హేమ. మే 19న బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదైందని.. తనకు టెస్టులు చేసింది జూన్ 3న , మరి అంతకంటే ముందే తాను పాజిటివ్‌గా తేలానంటూ మీడియా తప్పుడు వార్తలు రాసిందని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని, ఏ టెస్ట్‌కైనా రెడీ అని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్‌మెంట్ దొరికినా చాలని హేమ వ్యాఖ్యానించారు.

actress hema made sensational comments on janasena chief pawan kalyan victory in ap assembly elections 2024

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విక్టరీపైనా హేమ స్పందించారు. తాను పక్కా కాపు అని ఎన్నోసార్లు ఓపెన్‌గా చెప్పానని, అలాంటిది మా
పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఈ గొడవ వల్ల కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ స్టైల్లో మెడ వెనుకగా చేయి పెట్టుకుని.. జై జనసేన- జై కాపు గట్టిగా అరవలేకపోయానని హేమ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X