ఇండస్ట్రీలో డాష్‌లు లేరా? ఓ ఆడదానిపై ఏడుస్తారా? రేవ్ పార్టీపై హేమ స్ట్రాంగ్ కౌంటర్!

బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీ ఇన్సిడెంట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కలకలం రేపింది. వాసు అనే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ఇతర ప్రముఖులు భారీగా హాజరయ్యారు. బర్త్ డే పార్టీకి పర్మిషన్ తీసుకుని దానిని రేవ్‌పార్టీగా మార్చేశారు నిర్వాహకులు. డీజే బాక్సుల హోరు శృతిమించడంతో స్థానికులు ఏదో డౌట్ కొట్టడంతో వారు పోలీసులకు సమాచారం అందించడం.. పెట్రోలింగ్ టీమ్ రైడ్ చేయడంతో అసలు బండారం బయటపడింది.

రేవ్‌పార్టీకి హాజరైన వారిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. లిస్ట్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు వినిపించగా, తాను ఆ పార్టీలో లేనని హైదరాబాద్‌లోని తన ఫాంహౌస్‌లో చిల్ అవుతున్నానని హేమ వీడియోలు వదిలింది. దీంతో బెంగళూరు పోలీసులు స్పందించి.. అరెస్ట్ అయిన వారిలో హేమ ఉన్నట్లుగా ఆధారాలు చూపించారు. తన స్టేజ్ నేమ్‌ని దాచి కృష్ణవేణి అనే తన అసలు పేరుతోనే హేమ పార్టీకి వచ్చినట్లుగా కొన్ని ఛానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి. ఈ వ్యవహారంలో పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించకపోవడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కొద్దిరోజులు పరప్పన అగ్రహార జైలులో ఉన్న హేమ.. తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు.

actress hema made sensational comments on telugu tv anchor here s the details

నాటి నుంచి వరుసపెట్టి ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోన్న హేమ రేవ్‌పార్టీ ఘటనలో ఏం జరిగింది..? తన ప్రమేయం ఉందా..? లేదా అన్న దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆమె కోరుతున్నారు. వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్స్, గోళ్లు ఏం కావాలన్నా ఇవ్వడానికి రెడీ అని.. తనపై పడ్డ నిందను తొలగించుకోవాలన్నదే తన లక్ష్యమని హేమ చెబుతున్నారు.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఒక పార్టీని రేవ్‌పార్టీ అనడానికి నిబంధనలు ఏంటీ అని ఆమె ప్రశ్నించారు. బెంగళూరులో జరిగిన బర్త్ డే పార్టీకి శనివారం తాను వెళ్లానని.. ఆదివారం ఇదంతా జరిగిందని, ఈ ఇష్యూ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్నారు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు తాను శాంపిల్స్ ఇస్తే.. ఘటన జరిగిన రోజే తనకు పాజిటివ్ వచ్చిందని కొన్ని ఛానెల్స్ ప్రచారం చేశాయని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న ఒక అమ్మాయిని నేనే అన్నట్లుగా ప్రచారం చేశారని ఆమె ఫైర్ అయ్యారు.

actress hema made sensational comments on telugu tv anchor here s the details

తన వీడియోల కింద కామెంట్స్ పెట్టే వాళ్లు ఫేక్ అని.. వీరిలో సగం మంది ఆయా ఛానెల్స్‌కి చెందిన సిబ్బందేనని హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటీశ్వరులు నడుపుతున్న ఈ ఛానెల్స్ ఒక ఆడదాని మీద పడి బతకాలా అని ఆమె ప్రశ్నించారు. మీ ఇండస్ట్రీలో డాష్‌లు లేరా అంటూ ఓ ప్రముఖ ఛానెల్‌లోని యాంకర్ అన్నాడని.. దానికి ఇంకో ఛానెల్‌ కౌంటర్ ఇచ్చిందా, లేదు తప్పయిందని సదరు యాంకర్ క్షమాపణలు చెప్పాడా అని హేమ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X