నటి హేమకు తీవ్ర విషాదం.. పుట్టెడు దు:ఖంలో మునిగి..
తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటి హేమ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లి కోళ్ల లక్ష్మీ ఇకలేరనే వార్తతో ఆమె తల్లడిల్లిపోయారు. తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. తన తల్లి మరణవార్త తెలుసుకొన్న హేమ వెంటనే హుటాహుటిన తన సొంతూరు రాజోలుకు చేరుకొన్నారు. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆమెకు సినీ ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా పరామర్శించారు. హేమకు ఎదురైన విషాదం వివరాల్లోకి వెళితే..
హేమ తల్లి లక్ష్మీ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు కొంతకాలం హైదరాబాద్‌లోనే చికిత్సను అందించారు. వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించిన తర్వాత ఆమె కోలుకొన్నారు. దాంతో తన తల్లిని సొంత గ్రామం తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు పంపించారు. అయితే గత కొద్ది రోజులుగా ఆరోగ్యం ఉండటంతో హేమ కొంత మేరకు ఉపశమనం పొందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే సోమవారం రాత్రి తన తల్లితో హేమ మాట్లాడారు. నిన్న ఉదయం కూడా ఫోన్‌లో బాగా మాట్లాడారు. అయితే అంతలోనే ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు అని బంధువులు తెలిపారు. తన తల్లి మరణ వార్తను తెలుసుకొని వెంటనే మంగళవారం ఉదయం రాజోలుకు చేరుకొన్నారు. తల్లి పార్ధీవ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని భోరున విలపించారు. హేమ దు:ఖంలో మునిగిపోవడంతో ఆమెను ఓదార్చడం కుటుంబ సభ్యుల వల్ల కాలేకపోయింది. ఆమె విషాదంలో కూరుకుపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా దిగ్బ్రాంతికి గురయ్యారు.
హేమ తల్లికి హిందూ సంప్రదాయ పద్దతుల్లో అంత్యక్రియలు జరిపించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువురు స్థానిక నేతలు, పెద్దలు కన్నీటి వీడ్కోలు తెలిపారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమెను పలువురు పరామర్శించి ఓదార్పు పలికారు.


Click it and Unblock the Notifications











