Rave Party: హేమ అరెస్ట్‌కు ముందు సినీ ఫక్కీలో ట్విస్టు.. బురఖాలో ముసుగేసుకొని హైడ్రామా!

తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మే 19వ తేదీన హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ వాసు జన్మదిన వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో భారీగా జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా హేమతోపాటు మరొకొందరు సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పలు కోణాల్లో దర్యాప్తు జరిపిన అనంతరం హైదరాబాద్‌లో ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. అయితే ఈ అరెస్ట్ వెనుక జరిగిన తతంగం వివారాల్లోకి వెళితే..

రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన తర్వాత కృష్ణ వేణి పేరుతో ఉన్న ఆమెను సినీ నటి హేమగా గుర్తించారు. దాంతో తెలుగు సినిమా ప్రముఖులు రేవ్ పార్టీలో ఉన్నారనే విషయం భగ్గమన్నది. దాంతో ఏ సినీ తారలు ఉన్నారనే విషయంపై తెలుగు, దక్షిణాది మీడియా ఆరా తీసింది.

Actress Hema seen in Burkha and Gone thru Medical Test after arrest by Bangalore Police

అయితే తన పేరు బయటకు రాగానే ఆమె రేవ్ పార్టీకి సంబంధం లేదు. నేను హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియో తప్పుదారి పట్టించేలా ఉందని వెంటనే అర్ధమైంది. దాంతో రేవ్ పార్టీలో ఆమె ఉన్నట్టు బట్టబయలు అయింది.

Actress Hema seen in Burkha and Gone thru Medical Test after arrest by Bangalore Police

అయితే రేవ్ పార్టీలో పట్టుబడిన వారందరికి బెంగళూరు సెంట్రల్ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో హేమతోపాటు 89 మందికి పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ కొనసాగించారు.

Actress Hema seen in Burkha and Gone thru Medical Test after arrest by Bangalore Police

ఇదిలా ఉండగా, పాజిటివ్‌ అని తేలిన వారందర్ని విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే రెండుసార్లు నోటీసులు పంపినా హేమ వెళ్లకపోవడంతో బెంగళూరు నుంచి టీమ్ వచ్చి.. ఆమెను విచారించారు. అనంతరం తదుపరి విచారణ కోసం ఆమెను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

హేమను అదుపులోకి తీసుకొన్న తర్వాత ఆమెను బెంగళూరుకు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమె బురఖాలో రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఆమె తన అస్థిత్వాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X