డ్రగ్స్ అన్నీ నా బాడీలోనే.. శిక్ష వేయండి.. లేకపోతే చచ్చిపోతా.. మీడియాకు నటి హేమ సవాల్
Actress Hema: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో రోజురోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ పార్టీని నిర్వహించారో.. ఈ కేసులో ఎవరు కీలక నిందితులో.. తెలియదు. కానీ, నటి హేమ మాత్రం చిక్కుకుంది. ఇక హేమ సెలబ్రెటీ కాబట్టి.. ఆమెనే ఫోకస్ చేస్తూ వార్తలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్‌తోపాటు పలు మీడియా సంస్థలకు టాలీవుడ్ నటి హేమ ఓపెన్ సవాల్ విసిరింది.
తాజాగా నటి హేమ మరో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలు నటి హేమ మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నాయనీ, గతంలోని న్యూస్ లనే మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారనీ, తన డ్రగ్స టెస్టుల్లో పాజివిట్ వచ్చిందని పదే పదే చెపుతున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తానే ఛార్జ్‌షీట్ చూడలేదని, అలాంటిది మీడియా వాళ్ల చేతికి ఎలా వెళ్తుందని ప్రశ్నించింది. తనపై ఇలాంటి కథనాలను ఎందుకు ప్రసారం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది హేమ.

కొన్ని మీడియా సంస్థలు కావాలనే తనపై అసత్య కథనాలను ప్రచారం చేస్తుందని, ఇప్పటికైనా వాటిని ఆపండని కోరారు. మీరు ఎక్కడికి తాను రమ్మంటే అక్కడికి వస్తానని, మీరే డ్రగ్స్ టెస్టు చేయించాలని తనకు పాజిటివ్ వస్తే.. తాను కాళ్లు పట్టుకుని క్షమపణ కోరుతాననీ, మీరు ఏ శిక్ష వేసినా తను అందుకు సిద్దంగా ఉన్నానని పేర్కొంది. ఒకవేళ చేయించిన టెస్టుల్లో నెగిటివ్ వస్తే.. మీరు ఏం చేస్తారని మీడియా సంస్థలకు బహిరంగ సవాలు విసిరింది.
ఎలాంటి ఆధారాలు లేకుండా.. అసత్య వార్తలను ప్రచారం చేయడం వల్ల తన అమ్మ తీవ్ర ఆందోళనకు లోనవుతుందనీ, తన అనారోగ్యం మరింత క్షీణించిదని ఆవేదన వ్యక్తం చేసింది నటి హేమ. తాను పరువు కోసం చనిపోయే వ్యక్తినీ, తన ఫ్యామిలీ తలదించుకునే పనిని ఏ రోజు చేయలేదని, భవిషత్తులో కూడా చేయబోనని భావోద్వేగానికి లోనైంది.

అసలేం జరిగిందంటే.. బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో మే 15న ఓ రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్, పలు నిషేధిత పదార్థాలను వాడుతున్నారనీ, అసభ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని కర్ణాటక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఆ రేవ్ పార్టీపై దాడి పలువురిని అరెస్టు చేశారు. ఓ రేవ్ పార్టీలో నిందితుల్లో పాటు నటి హేమ కూడా పట్టుబడింది. ఇటీవల నటి హేమ సహా ఇతర సెలబ్రెటీలపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ( సీసీబీ ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 1100 పేజీలతో కూడిన ఛార్జ్‌షీటును అంద జేసినట్టు తెలిసింది. వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకలో భాగంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు దర్యాపులో తెలింది. ఆ పార్టీ నిర్వాహకుడు హేమకు బెస్ట్ ఫ్రెండ్ అంట. అయితే.. పార్టీలో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకుందని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











