నడిరోడ్డుపై స్టార్ హీరోయిన్ సోదరుడి దారుణహత్య.. హత్యకు కారణం ఏంటంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హుమా ఖురేషీ సోదరుడు అసిఫ్ ఖురేషీ దారుణ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. భర్త ప్రాణాలను కాపాడే క్రమంలో ఖురేషీ భార్యపైనా అగంతకులు దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసిఫ్ ఖురేషీ హత్య వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

పార్కింగ్ వివాదంతో గొడవ
ఆసిఫ్ ఖురేషీ.. హుమా ఖురేషీకి వరుసకు బంధువు అవుతాడు. ఆయన తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి తన ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇద్దరు వ్యక్తులు బైక్‌ను పార్కింగ్ చేశారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఆసిఫ్ ఆ బైక్‌ను తొలగించాలని అడగ్గా.. ఆ యువకులు ఆయనతో గొడవకు దిగారు. అనంతరం మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో ఆసిఫ్‌పై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు.

Actress Huma Qureshi s Brother Asif Qureshi killed in Delhi

నిందితులు అరెస్ట్
అప్పటికే ఆసిఫ్ పరిస్ధితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆసిఫ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై మృతుడి భార్య సైనాజ్ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్కింగ్ విషయంలో తరచుగా తన భర్తతో నిందితులు గొడవ పడేవారని ఫిర్యాదులో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోదరుడి మరణవార్త తెలుసుకున్న సినీనటి హుమా ఖురేషి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బోల్డ్ రోల్స్‌తో సెగలు
హుమా ఖురేషి విషయానికి వస్తే.. 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్‌తో కుర్రాళ్లకు సెగలు రేపింది. గ్లామర్ పాత్రలే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనలోని నటిని బయటకు తీసుకొచ్చింది హుమా ఖురేషి. హిందీతో పాటు మరాఠీ, మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటించింది హుమా. ప్రస్తుతం బాయాన్, జాలీ ఎల్ఎల్‌బీ 3, టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, పూజా మేరి జాన్, గులాబీ తదితర సినిమాల్లో హుమా ఖురేషి నటిస్తున్నారు.

బాడీ షేమింగ్‌పై ఫైర్
ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం హుమా స్టైల్. ఇందులో నో కాంప్రమైజ్ అని పలుమార్లు నిరూపించుకున్నారు. గతంలో తనపై బాడీ షేమింగ్ కామెంట్స్‌కు పాల్పడిన వారికి ఖురేషి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రోలర్స్ కంటే ఓ రివ్యూవర్ విమర్శలు చేయడం బాధించిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నచ్చకపోతే ఎలాంటి సమస్య లేదు.. ఎందుకంటే అది మీ ఛాయిస్, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని హుమా మండిపడ్డారు. రివ్యూవర్లు సినిమా గురించి రాయకుండా నటీనటులను మరింత కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారని హుమా ఫైర్ అయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హుమా ఖురేషి ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, షోలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. మొన్నామధ్య జమ్ముకాశ్మీర్‌లో పర్యటించిన హుమా ఖురేషి సైనికులతో ముచ్చటించారు.

More from Filmibeat

Read more about: huma qureshi bollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X