యువ నటి అనుమానాస్పద మృతి... హత్యా? ఆత్మహత్యనా?
పాకిస్థాన్‌లో యువ నటి, మోడల్, ఫిట్‌నెస్ ట్రైనర్‌గా గుర్తింపు పొందిన హుమైరా అస్గర్ ఆలీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కరాచీ తదితర ప్రాంతాల్లో సంచలనం రేపింది. ఆమె మరణించిన రెండు వారాల తర్వాత ఆమె దేహాన్ని గుర్తించడం మరింత విషాదంగా మారింది. 32 సంవత్సరాల హుమైరా దేహాన్ని స్వాధీన పరుచుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు గురించిన వివరాలు, హుమైరా వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే..
పాకిస్థాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హుమైరా అస్గర్ ఆలీ పాపులర్ సెలబ్రిటీగా గుర్తింపు పొందారు. ఏఆర్‌వై డిజిటల్‌లో ప్రసారమైన తమాషా రియాలిటీ షో ద్వారా అత్యంత పాపులారిటీ సంపాదించుకొన్నారు. పాకిస్థాన్ బుల్లితెర మీద ఎహసాన్ ఫారామోష్, గురు లాంటి సీరియల్స్ నటించారు. ముక్కుసూటిగా, బోల్డుగా మాట్లాడటం తీరు కారణంగా ఆమె లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో 714K ఫాలోవర్స్ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.

కరాచీలో పోలీస్ ఉన్నతాధికారి మీడియతో మాట్లాడుతూ.. ఢిఫెన్స్ హౌసింగ్ అథారిటీలోని అపార్ట్‌మెంట్‌లో హుమైరా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె దేహాన్ని స్వాధీనం చేసుకొన్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆమె మరణించి కనీసం రెండు వారాలు అయి ఉంటుంది. లోకల్ కోర్టు ఆదేశాల మేరకు ఇంటిని ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులు డోర్‌ను కొట్టారు. అయితే లోపలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపులు ధ్వంసం చేసి వెళితే..ఆమె దేహం కనిపించిందిఅని చెప్పారు.
గది లోపలి నుంచి తలుపులు వేసుకొన్నార. ఆమె ఇంటిలోపల ఒక్కరే ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే ప్రాథమిక విచారణ అనంతరం ఆమెపై ఎలాంటి అఘాయిత్యంగానీ, ఎవరైనా దాడికి పాల్పడినట్టుగానీ ఆనవాళ్లు లేవు. ఆమె దేహాన్ని జిన్నా హాస్పిటల్‌కు పంపించి దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు. ఆమెది హత్యా? ఆత్మహత్యనా? అనే కోణంలో అధికారులు విచారణ మొదలుపెట్టారు.


Click it and Unblock the Notifications











