అరవింద్, సురేష్‌బాబు నా బిడ్డల్లాంటి వాళ్లు.. సంతోషం అవార్డుల ఫంక్షన్‌లో జమున ఎమోషనల్

సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా 6 గంటకు పైగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి. అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటిదర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌, బాబూమోహన్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌, కార్తికేయ, రాంకీ, విష్వక్‌సేన్‌, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, నటాషా దోషి, అవికా గోర్‌, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అంబికా కృష్ణ, దిల్‌ రాజు, తమిళ హీరో జయం రవి, కన్నడ నటుడు, ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, తమిళ వెటరన్‌ యాక్ట్రెస్‌ కుట్టి పద్మిని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంగీత దర్శకుడు తమన్‌, గాయకుడు అనురాగ్‌ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు అమితమైన ఆకర్షణ తీసుకొచ్చారు.

ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి సీనియర్‌ హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ చేతుల మీదుగా ఫిల్మ్‌ జర్నలిజంలో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. పదిహేడు సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ వేడుకను ఒంటిచేత్తో నిర్వహించడం సురేష్‌ కొండేటికే సాధ్యమని బాబూ మోహన్‌ ప్రశంసించారు.

Actress Jamuna emotional in Santosham South Indian Film Awards

'మహానటి'లో నటనకు గాను ఉత్తమ సపోర్టింగ్‌ ఆర్టిస్టు అవార్డును జమున చేతుల మీదుగా అందుకున్న డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. ''మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుగారు నా సినిమాలు చూసి ఆనందించేవారని చెప్పారు. అందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవార్డు రావడానికి కారకులు ఆ పాత్రను సృష్టించిన రచయితలు, దర్శకులు. వాళ్లిచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపర్చుకున్నాను. నేను మీరు ఫీలయినంతకాలం పనిచేస్తూనే వుంటాను. అల్లు అరవింద్‌ వంటి సీనియర్‌ నిర్మాతలు మంచి సినిమాలు తీసి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇలాంటి అవార్డులు దక్కుతాయి. ఏ కళాకారుకారుడికైనా ఈ అవార్డులు ఉత్సాహాన్నిస్తాయి'' అన్నారు.

'మహానటి' చిత్రంలో చిన్నప్పటి సావిత్రిగా నటించిన సాయి తేజస్వినికి జమున బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్టు అవార్డు అందజేశారు. సాయి తేజస్విని మాట్లాడుతూ.. ''వెరీ హ్యాపీ.. నాకీ అవార్డు ఇచ్చిన సురేష్‌ అంకుల్‌కు థ్యాంక్స్‌. 'మహానటి' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ గారికీ, ప్రొడ్యూసర్‌ స్వప్నా దత్‌ గారికీ థ్యాంక్స్‌'' అన్నారు.

65 సంవత్సరా సినీ జీవితం పూర్తయిన సందర్భంగా విఖ్యాత నటి జమున నిర్మాతలు అల్లు అరవింద్‌, డి. సురేశ్‌ బాబు చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''జమునగారు నటించిన తొలి సినిమా 'పుట్టిల్లు'లో మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) కూడా నటించారు. మద్రాస్‌లో మేముండే వీధిలోనే ఆమె కూడా ఉండేవారు. ఇప్పుడు ఆమెకు నేను అవార్డు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.

సురేశ్‌బాబు మాట్లాడుతూ ''మా నాన్నగారు సోలోగా నిర్మించిన మొదటి సినిమా 'రాముడు భీముడు'లో జమున గారు హీరోయిన్‌గా నటించారు. నా చిన్నతనంలో మేము, ఆమె ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. నా చేతుల మీదుగా ఆమెకు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.

జమున మాట్లాడుతూ ''అరవింద్‌, సురేష్‌బాబు నా బిడ్డల్లాంటి వాళ్లు.. సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాతలుగా ఉండడం ఆనందదాయకం. సురేష్‌ కొండేటి ఈ అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది'' అన్నారు.

ఆమె సన్మాన కార్యమ్రంలో పాల్గొన్న రోజారమణి మాట్లాడుతూ ''ఇక్కడ రెండు సంఘటను గుర్తుకు వస్తున్నాయి. జమున అమ్మకు కొడుకులా నేను నటిస్తే, కూతురుగా కుట్టి పద్మిని నటించింది. ఇద్దరూ ఒకే స్టేజీమీద వుండడం చాలా ఆనందాన్ని కల్గించింది. జమునగారు పెద్ద నటి అయినా స్వంత బిడ్డగా ప్రేమిస్తారు. సన్మానంలో మేం కూడా వుండడం సంతోషం'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X